Begin typing your search above and press return to search.

సవ్యసాచి ఫలితం పై మాధవన్ రియాక్షన్ ఇదే

By:  Tupaki Desk   |   11 Nov 2018 5:56 AM
సవ్యసాచి ఫలితం పై మాధవన్ రియాక్షన్ ఇదే
X
తమిళ హీరో మాధవన్ ఈమధ్య నాగ చైతన్య-చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కిన 'సవ్యసాచి' సినిమాలో ఒక కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపుగా నిలిచింది. ఈ సినిమా ఫలితంపై ఈమధ్య మాధవన్ స్పందించాడు.

గోల్డెన్ ఈగల్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మాధవన్ మీడియాతో ముచ్చటిస్తూ తన సినిమాల గురించి కూడా మాట్లాడాడు. 'విక్రమ్ వేదా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత 'సవ్యసాచి' లో నటించానని.. సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందని అన్నాడు. తనవైపు నుండి సినిమాకు బెస్ట్ ఎఫర్ట్ పెట్టానని అందుకు హ్యాపీ గా ఉందన్నాడు.

మాధవన్ ప్రస్తుతం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన కెరీర్లో ఇదో బెస్ట్ ఫిలిం అవుతుందన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుతోందని.. హీరోయిన్ కోసం ఇంకా వెతుకుతున్నామని తెలిపాడు. ఈమధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది.