Begin typing your search above and press return to search.
మైత్రికి అలాంటి కండిషన్ పెట్టిన మాధవన్!
By: Tupaki Desk | 1 Nov 2018 7:06 AM GMTసినీ ప్రేమికుల్లో మాధవన్ పేరు తెలియని వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. మణిరత్నం స్కూల్ నుండి రావడంతో మొదట్లోనే మాధవన్ కు గుర్తింపు వచ్చింది. తమిళ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా డబ్బింగ్ వెర్షన్లతో తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు. హిందీలో సోలో హీరోగా సినిమాలు చేస్తే క్లిక్ కాలేదు గానీ 'రంగ్ దే బసంతి'.. '3 ఇడియట్స్' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలనో కీలకపాత్రలు పోషించి ఆడియన్స్ ను మెప్పించాడు. తాజాగా 'సవ్యసాచి' తో మొదటి సారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
గతంలో 'ఓం శాంతి' అనే తెలుగు సినిమాలో ఓ చిన్న క్యామియో చేశాడు.. దాన్ని పక్కనబెడితే ఇదే అయన తెలుగు సినిమా. తమిళం లో హీరో గా చేస్తూ హిట్స్ సాధిస్తున్నాడు. 'ఇరుది సుట్రు'.. 'విక్రమ్ వేదా' లాంటి సినిమాలు మాధవన్ కు ఎంతో పేరు తీసుకొచ్చాయి. మరి అలాంటప్పుడు తెలుగులో విలన్ రోల్ కు ఎలా ఒప్పుకున్నాడు? చందూ మొండేటి కథ.. తనకు ఇచ్చిన పాత్రం చాలా నచ్చడం తో సినిమా చేద్దామనుకున్నాడట. కానీ నిర్మాతలు మైత్రీ వారికి మాత్రం ఒక కండిషన్ పెట్టాడట. తమిళం లో రిలీజ్ చేయకుండా ఉండేపనైతేనే 'సవ్యసాచి' లో నటిస్తానని చెప్పాడట. మైత్రీ వారు దానికి ఒప్పుకోవడంతోనే తన విలనీ చూపించడానికి రెడీ అయ్యాడట.
నాగ చైతన్య - నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మ్యాడ్ మ్యాడీ వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ తో బాధపడే చైతును ఏం చేస్తాడో.. చైతు తిరిగి ఎలా ఈ హ్యాండ్సమ్ విలన్ ను ఎలా ఎదుర్కుంటాడో మనకు రేపే తెలుస్తుంది.