Begin typing your search above and press return to search.
మాధవన్.. మిషన్ ఇంపాజిబుల్
By: Tupaki Desk | 22 May 2018 4:51 AM GMTఅక్కినేని హీరో నాగ చైతన్య కెరీర్ లో రొమాంటిక్ సినిమాలతోనే హిట్ కొట్టాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టెయినర్లు చేసినప్పుడల్లా ఎదురుదెబ్బ తగులుతూనే వచ్చింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో అతడు చేస్తున్న యాక్షన్ మూవీ బజ్ ఏర్పడింది తాజాగా చేస్తున్న సవ్యసాచి సినిమాకే.
ప్రేమమ్ ఫేం చందు మెండేటి డైరెక్షన్ లో సవ్యసాచి సినిమా తెరకెక్కుతోంది. ఇందులో యాక్షన్ ఎసిపోడ్లే హైలైట్ అని ముందుగానే చెప్పేశారు. దానికితోడు ఇందులో విలన్ గా తమిళ హీరో మాధవన్ చేస్తుండటం ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో హీరో రోల్ కన్నా విలన్ పాత్రే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ అన్నింటిలో హీరో కంటే విలనే బలవంతుడిగా కనిపిస్తాడు. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుందనేది మిషన్ ఇంపాజిబుల్ కాన్సెప్ట్.
దాదాపుగా సవ్యసాచిలోనూ ఇదే స్టయిల్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో విలన్ హీరో కుటుంబ సభ్యులను బంధించి అతడిని తాను చెప్పినట్టల్లా ఆడిస్తుంటాడని... అతడి ఎత్తులను తిప్పికొడుతూ చివరకు అనుకన్నది సాధించడం అన్నదే సవ్యసాచి స్టోరీ లైన్ గా ఉంటుందట. చూద్దాం ఈ మిషన్ ఇంపాజిబుల్ టైప్ విలనిజం ఎంతవరకు మెప్పిస్తుందో.