Begin typing your search above and press return to search.

చైతు మూవీలో మ్యాడీ పాత్ర ఇదేనా

By:  Tupaki Desk   |   3 Jun 2018 6:23 AM GMT
చైతు మూవీలో మ్యాడీ పాత్ర ఇదేనా
X
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి రూపొందిస్తున్న సవ్యసాచి షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. నిజానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల మూడో వారంలో విడుదల కావాలి. కానీ కొంత ప్యాచ్ వర్క్ తో పాటు సిజి కూడా బాలన్స్ ఉండటంతో ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇకపోతే ఇందులో మాధవన్ నటించిన రోల్ ఎలా ఉంటుందా అనే అంచనాలు ముందు నుంచి ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. తన బర్త్ డే సందర్బంగా విషెస్ చెబుతూ యూనిట్ షేర్ చేసుకున్న స్టిల్ లో మాధవన్ లుక్ చూస్తుంటే ఇందులో ఏదో స్టైలిష్ విలన్ గా కొత్త తరహా పాత్ర చేసినట్టు కనిపిస్తోంది. అంటే ముందు నుంచి అనుకున్నట్టు చైతుకు ఛాలెంజ్ విసిరే పవర్ ఫుల్ పాత్రలో మాధవన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇది పోస్టర్ ని బట్టి వేసిన అంచనానే అయినప్పటికీ నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ తక్కువ స్థాయిలో ఇంతవరకు ఏ సినిమా నిర్మించని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందటం ట్రేడ్ లో ఆసక్తి రేపుతోంది.

ఒక చేయి తన ఆధీనంలో ఉండని ఆసక్తికరమైన పాత్ర చేస్తున్న చైతుతో మాధవన్ ఆడే ఆట చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. దానికి తోడు నాని ఎంసీఏ సినిమాతో సక్సెస్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన భూమిక ఇందులో చైతుకు అక్కయ్యగా నటించడం మరో ప్లస్ పాయింట్. వినిపించిన టాక్ ప్రకారం భూమిక మాధవన్ కు జోడిగా కనిపించవచ్చట. అంటే స్టోరీలో చైతన్యకు సవాల్ విసిరేది స్వంత బావే అన్న మాట. మొత్తానికి లైన్ అయితే ఇంటరెస్టింగ్ గానే ఉంది. చైతు ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ లో బిజీ కాగా మాధవన్ తన వరకు చేయాల్సిన పార్ట్ సవ్యసాచిలో పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మరి మాధవన్ పాత్ర గురించి వస్తున్న న్యూస్ నిజమో కాదో ఒక్క తనకు యూనిట్ కు తప్ప ఇంకెవరికి తెలియదు. మరి లీక్ అయిన ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే కనీసం ట్రైలర్ రిలీజ్ దాకా అయినా ఆగాలి