Begin typing your search above and press return to search.
మీరాబాయి చాను ఫొటోపై మాధవన్ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 31 July 2021 1:30 PM GMTఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను దేశానికి ఎంత కీర్తిని అందించినా.. ఆమె జీవితం మాత్రం సాధారణమైందనేట.. ఆమెకు కోట్లు, లక్షలు లేవు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దేశానికి ప్రతిష్టాత్మక పథకాన్ని అందించింది.
తాజాగా మణిపూర్ లో ఇంటికి చేరింది మీరాబాయి. ఆమె ఇంటిలో ఎంత సర్వసాధారణంగా ఉంటుందో తీసిన తాజా ఫొటో వైరల్ అవుతోంది. ఆమె వినయపూర్వకమైన నివాసంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఫొటోను ట్విట్టర్ లో చూసిన నటుడు మాధవన్ తాజాగా చిత్రం వైరల్ కావడంపై స్పందించాడు. తన అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ వైరల్ అయిన ఫొటోలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి.. తన కుటుంబ సభ్యులో ఒక చిన్న ఇరుకు ఇంట్లో కూర్చొని నేలపై భోజనం తింటోంది.
ఈ ఫొటోను ట్వీట్ చేసిన మాధవన్ ‘హే ఇది నిజం కాదు.. నేను నమ్మడం లేదు’ అంటూ పేర్కొన్నాడు. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత మీరాభాయ్ చాను ఇంటికి తిరిగి వచ్చిందని ట్విట్టర్ లో ఒక యూజర్ చేసిన అసలైన ట్వీట్ ఇదీ.. ‘ఈ ధృడ సంకల్పంతో ఉన్న మహిళ తనకు వనరులు లేకపోయినా పేదరికం ఆమె కలలను సాకారం చేసుకోకుండా ఆపలేదు. ఇది నిజమైన స్ఫూర్తి’ అని పేర్కొన్నాడు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మనందరికీ స్ఫూర్తినిచ్చే శక్తి ఆమెకు ఉందని.. పేదరికం వెంటాడని ఆమె దేశానికి పతకాన్ని అందించింది. జీవితంలోని ఎలా ఎత్తుకు ఎదగాలన్నది ఆమె నుంచి నేర్చుకోవచ్చు. ఆమె జీవితం మనకు స్ఫూర్తి. చాను ఒలింపిక్స్ గెలిచినప్పుడు ఇదే మాధవన్ గతంలో ఆమెను పొగుడుతూ అభినందనలు తెలిపారు.