Begin typing your search above and press return to search.
'గజిని' నేను చేయాల్సింది.. కథ నచ్చలేదు!
By: Tupaki Desk | 5 July 2022 7:22 AM GMTతమిళంతో పాటు తెలుగు.. హిందీ భాషల్లో సూపర్ హిట్ అయిన గజిని సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. గజిని సినిమా ఇన్ పుట్స్ ను ఎన్నో సినిమాల్లో కూడా వాడుకోవడం మనం చూశాం.
తమిళంలో సూర్య హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో గజిని వచ్చింది. తెలుగు లో డబ్ అయ్యి అక్కడ ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమీర్ ఖాన్ ఈ రీమేక్ పట్ల ఆసక్తి చూపించాడు.
తెలుగు నిర్మాత అల్లు అరవింద్ హిందీలో రీమేక్ చేయడంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. గజిని సినిమా తమిళంలో మరియు హిందీలో ఒక ల్యాండ్ మార్క్ సినిమా అన్నట్లుగా నిలిచి పోయింది అనడంలో సందేహం లేదు.
అలాంటి గజిని సినిమా ఆఫర్ మొదట సూర్య వద్దకు కాకుండా మాధవన్ వద్దకు వెళ్లిందట. ఆ విషయంను స్వయంగా మాధవన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
2005 సంవత్సరంలో వచ్చిన గజిని సినిమా కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా స్క్రిప్ట్ మొదట నా వద్దకు వచ్చింది. దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ బాగా నచ్చింది కాని సెకండ్ హాఫ్ విషయంలో నాకు కాస్త అనుమానంగా అనిపించింది. అందుకే నేను గజిని సినిమా ను తిరస్కరించాను అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు.
సూర్య అద్బుతంగా గజిని పాత్రలో నటించాడు. సూర్య చాలా కష్టపడ్డాడు అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు. తాజాగా మాధవన్ నటించిన రాకేట్రి సినిమా ను భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఆ సందర్బంగానే సూర్య తో లైవ్ చిట్ చాట్ చేశాడు. ఆ సందర్బంగా గజిని మ్యాటర్ ప్రస్తావనకు వచ్చింది.