Begin typing your search above and press return to search.
అభిమాని ప్రశ్నకు `ఐ యామ్ వెరీ సారీ` అనేసిన మ్యాడీ..!
By: Tupaki Desk | 9 Oct 2020 11:30 PM GMTఉన్న విషయాన్ని మొహం మీదే కడిగేసినట్టు అడిగేస్తే ఎవరైనా చిన్నబుచ్చుకుంటారు. కానీ మ్యాడీ అలియాస్ మాధవన్ అలా కాదు. దానికి కూడా ఎంతో డౌన్ టు ఎర్త్ స్పందించారు. ఎంతో వినమ్రంగా అభిమాని అన్నదానిని విన్నారు. అంతే వినయంగా సమాధానం చెప్పారు. నిశ్శబ్ధం చిత్రంలో ఆయన పాత్ర అంత కన్విన్సింగ్ గా లేదని సూటిగా అడిగేసిన అభిమానికి అతడు `ఇంకేం చెప్పను... ఐ యామ్ వెరీ సారీ` అంటూ తెగేసినట్టు చెప్పేశారు.
మ్యాడీ మీ ఫ్లాష్ పోర్షన్ కన్విన్సింగ్ గా లేదు...! అని అతడు అనేయడం దానికి సారీ చెప్పేయడం అంతా సోషల్ మీడియా చాట్ లో చోటు చేసుకుంది. ఆర్ మాధవన్ - అనుష్క శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన నిశ్శబ్ధం గత వారం ఒటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. ఈ చిత్రం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనకు తెరతీసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అనుష్క శెట్టిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో నటించారు. కొన్ని చోట్ల ల్యాగ్ ఇబ్బంది పెట్టిందని .. నిరాశ చెందామని క్రిటిక్స్ విమర్శించారు. #AskMaddy సెషన్లో అభిమానులలో ఒకరు ఫిల్మ్ ఫ్లాష్ భాగంలో పాత్ర కన్విన్సింగ్ గా లేదు అని అడిగారు.
దానికి మ్యాడీ ఆన్సర్ కూడా హృదయాలను గెలుచుకుంది. అభిమానులలో ఒకరు కూడా నిశ్శబ్ధమ్ చిత్రానికి ఓకే చేయడానికి కారణమం ఏమిటి? అని అడిగారు. దీనికి మాధవన్.. ``సరే మీరూ కొన్ని గెలుస్తారు. కొన్నిటిని కోల్పోతారు. నేనేం చెప్పగలను .. మేము మా వంతు ప్రయత్నం చేస్తాము`` అని అన్నారు. అనుష్క శెట్టితో 14 సంవత్సరాల తరువాత తిరిగి కలిసి నటించానని మ్యాడీ తెలిపారు. అనుష్క శెట్టి తెలుగులో ఇంత పెద్ద పేరు ఉన్నందున ఇది థియేట్రికల్ రిలీజ్ అవుతుందని నేను భావించాను. కానీ కుదరలేదు అని అన్నారు.

All Incan say is I am very sorry.