Begin typing your search above and press return to search.
మాధవీలతను తీసుకెళ్లారు.. రాంకీ దిగాడు
By: Tupaki Desk | 18 April 2018 10:00 AM GMTఎప్పుడూ లేని రీతిలో సినీ నటీనటులు ఇస్తున్న షాకులతో జూబ్లీహిల్స్ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పవన్ ను.. ఆయన తల్లిని ఉద్దేశించి సినీ నటి శ్రీరెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సినీ నటులు పలువురు నిరసనలు చేపట్టారు. ఒకరి తర్వాత ఒకరుగా చేస్తున్న నిరసనలతో పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ ఎదుట సినీ నటి మాధవీలత మౌనదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మాధవీలత మౌనదీక్ష సమాచారం తెలిసినంతనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కాసేపు వెయిట్ చేసిన వారు.. మాధవీలతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఊపిరి పీల్చుకున్నారు.
ఇది జరిగిన కాసేపటికే సినీ నటుడు రాంకీ నిరసన చేపట్టటంతో పోలీసులకు షాకింగ్ గా మారింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఫిలిం ఛాంబర్ ఎదుట చేస్తున్న దీక్షలు పోలీసులకు ఇబ్బందికరంగా మారాయి. ప్రముఖులు.. సినీ సెలబ్రిటీలు రోడ్ల మీదకు వచ్చి దీక్షలు చేయటం.. ట్రాఫిక్ కు భారీగా ఇబ్బందులు కలగటంతో నిరసన కార్యక్రమాల్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దీక్షలు చేయాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వటం.. అనుమతి తీసుకోవటం తప్పనిసరి అంటూ నటులకు నచ్చజెప్పి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాధవీలతను అదుపులోకి తీసుకున్న అనంతరం రాంకీని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరెంత మంది దీక్షలు చేస్తారో అర్థం కాక.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని ఏర్పాటు చేయటం గమనార్హం.