Begin typing your search above and press return to search.
కత్తి మహేష్ పై మాధవీ లత షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 7 July 2018 8:43 AM GMTరాముడిపై....రామాయణంపై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మహేష్ వ్యాఖ్యలపై సినీ నటుడు నాగబాబు - ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామిలతో పాటు పలువురు మండిపడ్డారు. ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు..మహేష్ పై చర్యలు తీసుకోకుంటే....తాము రంగంలోకి దిగుతామని పరిపూర్ణానంద హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహేష్ వ్యాఖ్యలపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత తీవ్రంగా ఖండించింది. మహేష్ పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. రావణుడి దగ్గర సీత ఉండాలి అని అనడానికి వీడు ఎవడని కత్తి మహేష్ ను ఉద్దేశించి మాధవీ లత షాకింగ్ కామెంట్స్ చేసింది. సీతమ్మ ఎక్కడ ఉండాలో నిర్ణయించడానికి వీడికి ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించింది. ముస్లిం - క్రిస్టియన్ - ఇతర మతాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేసి పరిణామాలు వేరే విధంగా ఉండేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు మతంలో ఉండే స్వేచ్ఛను మహేష్ వంటి వారు అడ్డం పెట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవీలత అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారతీయ స్త్రీలంతా ఆదర్శంగా తీసుకునే సీతమ్మ తల్లి గురించి అలా మాట్లాడేందుకు మహేష్ ఎవడని మాధవీ లత ప్రశ్నించింది. తాను లైవ్ షోలలో వేరే వ్యక్తులను వీడు, వాడు అని సంబోధించనని, కానీ మహేష్ వ్యాఖ్యల వల్ల ఇలా అనాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని లైవ్ షోలలో నోటికొచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించింది. ఒకవేళ ఆయనకు రామాయణం ఒక కథ అనిపిస్తే....నచ్చకపోతే ఇంట్లో కూర్చోవాలని...ఇలా బహిరంగంగా ఏదిపడితే అది మాట్లాడడం సరికాదని చెప్పింది. మహేష్ దుర్మార్గాలను భరించలేకనే ఆయనను భార్య వదిలేసిందని - అటువంటి వ్యక్తి మహిళల గురించి....హిందు దేవుళ్లు - సీతమ్మల గురించి ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించింది. మహేష్ తో ఆమె లీగల్ గా డైవోర్స్ కూడా తీసుకోకుండానే వెళ్లిపోయిందని - మహిళకు గౌరవం ఇవ్వకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారనే కారణంతోనే ఆమె విడిపోయిందని అన్నారు.
రావణుడితో ఉండి ఉంటే సీత ఎంజాయ్ చేసి ఉండేదేమోనని వ్యాఖ్యానించిన మహేష్ ను చెప్పుతో కొడుతానని మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా మాట్లాడేందుకు వీడు ఎవడని...అది వీడి జీవితమా? అని ప్రశ్నించింది. వాడిని భార్య వదిలేసిందని, వీడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భగా ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. వెంకటేశ్వర సుప్రభాతాన్ని బూతు అని - శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెట్టాలని గోగినేని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఒకవేళ గోగినేని...శ్రీ కృష్ణుడిపై హైకోర్టు నుంచి నోటీసుల తెచ్చినా.....శ్రీకృష్ణుడిని ఎక్కడ నుంచి పట్టుకొస్తారని ప్రశ్నించింది. నెగిటివిటిని ప్రచారం చేయడానికే బాబు గోగినేని - మహేష్ కత్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రామాయణం - భగవద్గీత లనుంచి మంచిని ఎందుకు ప్రచారం చేయరని....వారి దృక్కోణంలో కనిపించిన చెడును మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మాధవీ లత ప్రశ్నించారు. మాధవీలత ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.