Begin typing your search above and press return to search.
అవునురా బై నేనిలానే ఉంటా.. నీకేంటి?
By: Tupaki Desk | 17 Oct 2018 5:06 AM GMTఅదే దరిద్రమో కానీ.. తమ కళ్లకు తగ్గట్లే అందరూ ఉండాలనుకోవటం.. ప్రతి ఒక్కళ్లల్లో ఏదో ఒక లోపం వెతకటం ఈ మధ్యన కొందరిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఈ తీరును మరింత పెంచేలా సోషల్ మీడియా ఒక సాధనంలా ఉపయోగపడుతోంది. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి.. అలా ఉన్నారు.. ఇలా ఉన్నారంటూ కామెంట్లు చేయటం ఎక్కువ అవుతోంది.
ఇలా ఒకరు వేలెత్తి చూపిస్తే ఎంత బాధన్నది అందరికి అనుభవమే అయినా.. అలా అనకుండా ఉండని తీరుతో పలువురు ఇబ్బంది పడే పరిస్థితి. సగటుజీవులతో పోలిస్తే.. సెలబ్రిటీలకు ఈ పోలికలతో చాలా ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది టాలీవుడ్ నటి మాధవీలతకు.
తాజాగా ఆమె బతుకమ్మసంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో.. ఫోటోల్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన నెటిజన్లలో చాలామంది ఆమె పొట్టిగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. కామెంట్స్ చేశారు. దీన్ని చూసిన మాధవీలత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మామూలుగానే ఫైర్ బ్రాండ్ అయిన మాధవీలతను ఆమె రూపాన్ని తక్కువ చేస్తూ కామెంట్స్ చేసిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాధవీలత ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
‘‘శ్రీనగర్ కాలనీలోని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. దానికి సంబంధించిన ఫోటోస్ - వీడియోస్ పోస్ట్ చేశా. చాలా మంది పొట్టిది.. పొట్టిది అంటూ కామెంట్స్ పెట్టారు. అవునురా బై నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా.. ఎక్కడన్నా నొప్పొచ్చిందా? నీకేమైనా మాయరోగం వచ్చిందా? నీకేమైనా పొయ్యేకాలం వచ్చిందా? లేదు కదా?" అంటూ విరుచుకుపడ్డారు.
ఈ తిట్ల దండకం అక్కడితో ఆగలేదు. మరింత పొడిగిస్తూ.. "మీ అమ్మ.. మీ అక్కా.. మీ చెల్లి అంతా పొడవుగా ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు. నాకు లేనిది.. మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవ్వడికేమైనా నొప్పొస్తే చెప్పండి. ఆ నొప్పికి వెళ్లి హాస్పిటల్‌లో చూపించుకోండి. లేదంటే అది శాడిస్టిక్ డిసీజ్ అనుకుంటా. వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకో. ఫోటో పెడితే నచ్చింది.. లేదంటే నచ్చలేదు.. అనాలి. నేను పొట్టే.. నేను నల్లగా ఉంటా అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై పేజ్’’ అంటూ ముఖం పగిలేలా వ్యాఖ్యలు చేసింది. నిజమే.. ఆమె ఏమైనా డిజైనర్ పీసా.. దేవుడు ఎలాంటి రూపాన్ని ఇస్తే దాన్ని ఓకే చేసింది. దాన్ని ఇష్టపడితే ఓకే.. లేదంటే నోర్మూసుకోవాలే కానీ.. లోపాలు వెతకటం సరికాదు.