Begin typing your search above and press return to search.
కాస్టింగ్ కౌచ్ ని చెరిపేయడం జరగదు
By: Tupaki Desk | 22 March 2018 7:54 AM GMTనచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లత కి కెరీర్ లో పెద్దగా హిట్లు అంటూ లేవు. నాని తో చేసిన స్నేహితుడా సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అప్పడుప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన కనపడే ఈ భామ ఈమధ్య ఇంటర్వ్యూలలో బాగానే కనిపిస్తోంది. ఈమధ్యనే ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పైన చేస్తున్న ఉద్యమానికి మీరు సపోర్ట్ చేస్తారా అంటే నేను చెయ్యను కాక చెయ్యను అంటూ తేల్చి చెప్పేసింది.
"80 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఇలాంటి డార్క్ సీక్రెట్స్ నడుస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిని కూకటి వెళ్లతో సహ పీకేయడం జరగవు. అవి ప్రతి చోట ఉన్నవే. ప్రైవేట్ సెక్టార్లో లెవా - గవర్నమెంట్ సెక్టర్లో లెవా.. ఇది ఓపెన్ గా ఉండే ఇండస్ట్రీ కాబట్టే ఇవి బయటికి వస్తున్నాయి. ఎం మీడియా వాళ్లకు తెలియదా ఈ సీక్రెట్లు? వెళ్లేందుకు బయటపెట్టట్లేదు. సెలెబ్రెటీలను బయటకు లాగి మరీ ఎందుకు వేస్తారు ఈ ప్రశ్నలు?" అంటూ అడిగింది. "ఇంత గ్లామరస్ ఫీల్డ్ లో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని చూస్తే అబ్బాయిల మనసు చలిస్తుంది. ఇన్నికోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నువ్వు నాకు కమిట్ అవుతావు అని అడుగుతారు. కమిట్ అవుతావు లేదా నీ ఇష్టం. కమిట్ అయితేనే సినిమాలు అని అన్ని సందర్భాల్లో మనం చెప్పలేం. తొంభై శాతం ఉంది. ఆ మిగిలిన 10 శాతం మంది అవకాశం రాక మంచివాళ్ళుగా మిగిలిపోతారు" అంటూ చెప్పుకొచ్చింది మాధవి.
"కొందరు మనకెందుకు ఒక స్థాయికి వచ్చాక ఆలోచిద్దాంలే అని అనుకుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలానే అబ్బో హీరోయిన్లతో ఎందుకు పెట్టుకోవటం ఆ గొడవలు ఎందుకు అని భయపడి దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ పోరాటాలు ఉద్యమాలు నాన్సెన్స్. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ని నామ రూపాలు లేకుండా చేయడం ఇంపాజిబుల్. ఇంకో 80 ఏళ్ళు పడుతుంది అంత ఓపిక ఉంటే పోరాడమని చెప్పండి" అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ సుందరి.