Begin typing your search above and press return to search.

పవన్ ఓటమి విడ్డూరం: మాధవీలత

By:  Tupaki Desk   |   26 May 2019 10:22 AM GMT
పవన్ ఓటమి విడ్డూరం: మాధవీలత
X
నీతి కోసం.. నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలానే ప్రచారం చేశారు. డబ్బు పంచనని.. నిజాయితీగా ఓటేయండని కోరారు. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది. పవన్ కూడా స్వయంగా గెలవకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. ఒక్కొక్కరు ఓపెన్ అవుతున్నారు. నాలుగైదు రోజులయ్యాక కానీ ఈరోజు నాగబాబు బయటకు వచ్చి ఓటమిపై ఈరోజు బాధను వెళ్లగక్కారు..

తాజాగా ఏపీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసింది మాధవీలత.. ఆమె గెలుస్తుందని ఆమే కాదు.. ప్రజలు కూడా ఎవ్వరూ ఊహించలేదు.. అంచనాలు లేవు. బీజేపీపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఓడిపోయింది..

తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఏపీ రాజకీయాలు, పవన్ ఓటమిపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది. తాను ఓడిపోయినందుకు బాధగా ఏమీ లేదని.. ఎక్కడా తాను గెలుస్తానని చెప్పలేదని.. తనకు ముందే ఓడిపోతానని తెలుసునని..కానీ పవన్ కళ్యాణ్ ఓటమి మాత్రం తనకు వింతగా విడ్డూరంగా ఉందని మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. మోడీ దేశంలో రావాలని అనుకున్నాని అన్నట్టే వచ్చారని తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారు.? పవన్ పై అభిమానంతో ఎన్ని మాటలు చెప్పారు.. ఇదేనా మీ ప్రేమ అంటూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యింది మాధవీలత. పవన్ ఓటమిని నేను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.

చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని ప్రజలు అభిమానులు కోరుతారని.. మరి జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరుఫున వస్తే ఎందుకు ఓడించారని మాధవీలత ప్రశ్నించారు. విద్యార్థులు ఏమయ్యారని.. డబ్బు, కులానికి అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో నీతిగా - నిజాయితీగా ఉంటే గెలిపించరా అని ప్రశ్నించారు.

ఈవీఎంలలో అక్రమాలు చేసి బీజేపీ గెలుస్తోందన్న చంద్రబాబు విమర్శలను మాధవీలత ఖండించారు. మోడీ మాయ ఉంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు ఒక్కసీటు కూడా గెలుచుకోలేదంటూ ప్రశ్నించారు. ఇది ప్రజల తీర్పు అని.. ఈవీఎం మాయ ఏమాత్రం కాదని మాధవీలత స్పష్టం చేశారు.