Begin typing your search above and press return to search.

ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట

By:  Tupaki Desk   |   1 Sep 2020 6:08 PM GMT
ఆ నటి పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారట
X
టాలీవుడ్ నటీమణులకు భిన్నం మాధవీలత. ఫైర్ బ్రాండ్ తరహాలో విరుచుకుపడుతుంది. మిగిలిన హీరోయిన్ల మాదిరి కాకుండా విషయం ఏదైనా సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం ఆమెకు అలవాటు. తాను చెప్పే విషయాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయోనన్న సేఫ్ గేమ్ తీరుకు ఆమె భిన్నంగా వ్యవహరిస్తుంటారు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన నిజాల్ని వెల్లడించారు. తాను మాట్లాడేది సంచలనం కోసం కాదని.. నిజాలు చెబుతున్నట్లుగా చెప్పిన ఆమె.. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల నోటి నుంచి మాట రాని రీతిలో ప్రశ్నల్ని సంధించారు. డ్రగ్స్ విషయంలో పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదంటూ సూటిగా అడిగేశారు.

గతంలో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులు ఎందుకు బలహీనపడ్డాయని ప్రశ్నించిన ఆమె.. డ్రగ్స్ తీసుకునే వారు బాధితులు మాత్రమే కాదు.. నేరస్తులు కూడా అని పేర్కొన్నారు. టాలీవుడ్ పార్టీల్లో చాలా కాలంగా డ్రగ్స్ వాడుతున్నారని చెప్పిన ఆమె.. ఐదేళ్ల క్రితం తాను హాజరైన కొన్ని పార్టీల్లో డ్రగ్స్ వాడారంటూ పెద్ద బాంబు పేల్చారు.

మాధవిలత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. అధికారులు రంగప్రవేశం చేసి.. ఆమె వెళ్లిన పార్టీలు.. అక్కడ హాజరైన వారు? డ్రగ్స్ వాడినట్లుగా ఆమెకు ఎలా తెలిసింది? ఇంతకీ వాడిన వారెవరు? లాంటి ప్రశ్నల్ని సంధిస్తే.. మాధవిలత ఏమని బదులిస్తారో? ఇంతకీ ఆమె మాటల్ని అధికారులు అంత సీరియస్ గా తీసుకుంటారంటారా? ఏమైనా ఒక సినీ నటి.. తాను పాల్గొన్న పార్టీల్లో డ్రగ్స్ వాడారంటూ ఓపెన్ అయ్యే దమ్ము తెలుగు ఇండస్ట్రీలో మాధవిలతకు మాత్రమే ఉంటుందేమో?