Begin typing your search above and press return to search.
ఆ సెక్స్ రాకెట్ లో నటులూ బాధితులే:మాధవీలత
By: Tupaki Desk | 17 Jun 2018 7:13 AM GMTటాలీవుడ్ లో కలకలం రేపుతోన్న చికాగో సెక్స్ రాకెట్ ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటి అపూర్వ, నటుడు కాదంబరి కిరణ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఫోన్ లైన్లో మాట్లాడిన హీరోయిన్ మాధవీలత ఈ సెక్స్ రాకెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఈవెంట్లోకు వెళ్లిన తర్వాత సెక్స్ రాకెట్ లో పాలుపంచుకొంటోన్న హీరోయిన్ల తరఫున ఇండస్ట్రీ ఎందుకు బాధ్యత వహిస్తుందని మాధవీలత ప్రశ్నించారు. టాలీవుడ్ లో పనిచేసే వందలాది హీరోయిన్లతో ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వ్యక్తయినా...ఈవెంట్ల కోసం సంప్రదించవచ్చని....దానికి ఇండస్ట్రీతో ఏం సంబంధం ఉండదని చెప్పారు. అమెరికాలోనే కాదని ...హైదరాబాద్ లో కూడా ఈ తరహా హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తోందని అన్నారు. ఈవెంట్లకు వెళ్లేటపుడే...ప్యాకేజా...విత్ అవుట్ ప్యాకేజా ...అని ఒప్పందం చేసుకుంటారని చెప్పారు.
ఈ వ్యవహారంలో హీరోయిన్ల పేర్లు మీడియాలో హైలైట్ అవుతాయని, కానీ ఈ సెక్స్ రాకెట్ లో నటీమణులతో పాటు కొందరు మేల్ ఆర్టిస్టులు కూడా బాధితులుగా ఉన్నారని చెప్పారు. అమెరికాలో జరుగుతోన్న సెక్స్ రాకెట్ లో నిందితులపై హ్యూమన్ ట్రాఫికింగ్, బ్లాక్ మెయిలింగ్ కేసులను అక్కడి పోలీసులు నమోదు చేశారని మాధవీలత అన్నారు. బాధితలు పాస్ పోర్టులు లాగేసుకొని వారి కుటుంబసభ్యులను బెదిరించి నటీనటులను ముగ్గులోకి దించి ట్రాప్ చేస్తున్నారని చెప్పారు. నటీనటుల మైండ్ సెట్ ను బట్టి ఈవెంట్ కో ఆర్డినేటర్లు....వారిని ట్రాప్ చేస్తారని చెప్పారు. రెండు మూడు ఈవెంట్లలో మంచి వాళ్లలా నటించి....ఆ తర్వాత ఈ సెక్స్ రాకెట్ లోకి దించుతారని చెప్పారు. కొత్తలో ఆర్టిస్టులకు ఎక్కువ డబ్బు ముట్టజెబుతారని, ఆ తర్వాత చీకటి బాగోతాలకు తెరలేపుతారని అన్నారు. ఒకవేళ అమెరికాలో ఈ తరహా ట్రాప్ లో చిక్కుకున్న అమ్మాయిలు భారత్ వచ్చిన తర్వాత...పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయరన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోగా.....మీడియాలో ఆ అమ్మాయి తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ అవుతుందని, చెడిపోయిన అమ్మాయిగా సమాజం ముద్ర వేస్తుందని చెప్పారు.