Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ లో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేదా?
By: Tupaki Desk | 3 Sep 2018 8:15 AM GMTబిగ్ బాస్-2 సీజన్ ముగింపునకు వచ్చేసరికి సరికొత్త వివాదాలు చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. గీతా మాధురి ముద్దుల ఎపిసోడ్ పై విమర్శలు రావడం....ఈ షోపై హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు నమోదు కావడం....తెలిసిందే. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన బాబు గోగినేని...షోపై - కౌశల్ ఆర్మీపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. హౌస్ లో చాలామంది ....తమను ప్రమోట్ చేసుకోవడానికి బయట కొందరిని సెట్ చేసుకు వచ్చారని బాబు ఆరోపించారు ఇక తాజాగా సినీ నటి మాధవీలత ....బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేక్షకుల ఓట్లకు బిగ్ బాస్ విలువ ఇవ్వడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. నిన్న రాత్రి నూతన్ నాయుడు ఎలిమినేషన్ అయిన నేపథ్యంలో మాధవీలత ఈ వ్యాఖ్యలు చేసింది.
నిన్న షో నుంచి నూతన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఓట్లు తక్కువ రావడంతో అమిత్ ఎలిమినేషన్ ఖాయమని ప్రేక్షకులు కూడా భావించారు. అయిత, అనూహ్యంగా అమత్ కంటే ఎక్కు వ ఓట్లు వచ్చిన నూతన్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో, నూతన్ ఎలిమినేషన్ పై మాధవీలత స్పందించింది. ఓట్లు ఎక్కువ వచ్చినా.....కేవలం రీ ఎంట్రీ కారణంగానే నూతన్‌ను బయటకు పంపించారని ఆమె ఆరోపించింది. ఇకపై ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువుండదని అర్థమైందని తెలిపింది. ఇకపై, కేవలం షోను చూసి ఆనందించడానికే పరిమితం కావాలని మాధవీలత సూచించింది. కాగా, శనివారం నాడు సామాన్యుడి కోటాలో హౌస్ లోకి వచ్చిన గణేశ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో, హౌస్ లో ప్రస్తుతం సెలబ్రిటీలు మాత్రమే మిగిలినట్లయింది.