Begin typing your search above and press return to search.

ఓపెన్ గా చెప్పేసింది.. ప‌వ‌న్ పిలుస్తారా?

By:  Tupaki Desk   |   20 March 2018 4:19 AM GMT
ఓపెన్ గా చెప్పేసింది.. ప‌వ‌న్ పిలుస్తారా?
X
తెలుగు సినిమాల్లో తెలుగ‌మ్మాయిలే క‌నిపించ‌ర‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి ఎవ‌రి చెప్పే రీజ‌న్స్ వారు చెబుతుంటారు. త‌మ డిమాండ్స్ త‌గ్గట్లు తెలుగ‌మ్మాయిలు కనిపించ‌టం లేద‌న్న మాట ద‌ర్శ‌క నిర్మాత‌ల‌దైతే.. ఎంత అందంగా ఉన్నా రాష్ట్రేత‌ర అమ్మాయిలకు ఇచ్చే ఇంపార్టెన్స్.. తెలుగ‌మ్మాయిల‌కు ఇవ్వ‌రంటూ ఇండ‌స్ట్రీని త‌ప్పు ప‌ట్టే వాళ్లు లేక‌పోలేదు. ఇదిలా ఉంటే.. అచ్చ తెలుగమ్మాయిగా రామోజీరావు సంస్థ నుంచి ప‌రిచ‌య‌మైన అందాల భ‌రిణె మాధ‌వీల‌త‌. న‌చ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాలోనే మంచి మార్కులు వేయించుకుంది. కానీ.. అవ‌కాశాలు అంతంతే.

కొన్ని సినిమాల్లో క‌నిపించినా.. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్నాళ్లు గ్యాప్ త‌ర్వాత‌.. ఆ మ‌ధ్య‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూ వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. దాదాపు గంట‌కు పైగా ఉన్న వెబ్ ఇంట‌ర్వ్యూను క‌ళ్ల‌ప్ప‌గించి చూసేశారు. చాలామంది సినిమా ఆఫ‌ర్ల‌తో పాటు.. బెడ్రూం ఆఫ‌ర్లు కూడా ఇచ్చార‌ని.. అందుకే ఛాన్స్ ల‌ను వ‌దులుకున్నానంటూ బాంబు పేల్చిన మాధ‌విల‌త.. త‌న‌లోని ఫైర్ బ్రాండ్ ను ఆవిష్క‌రించారు.ప‌లువురు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నా.. ఇలాంటోళ్ల‌కు అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్స్ లేదంటూ తేల్చేశారు. అందుకు త‌గ్గ‌ట్లే అందం.. అభిన‌యం అన్ని ఉన్నా మాధ‌వీల‌త‌కు ఛాన్స్ లు మాత్రం రాలేదు.

తాజాగా సోష‌ల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టారు. త‌న‌కు ప‌వ‌న్ మీద ప్రేమ ఉంద‌న్న ఆమె.. స‌మాజసేవ‌కు రెఢీ అని.. ప‌వ‌న్ పార్టీలో చేరేందుకు రెఢీ అని చెప్పేశారు. అయితే.. ప‌వ‌న్ ఆహ్వానిస్తే చేరిపోతాన‌ని పేర్కొన్నారు. ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే.. "ప‌వ‌న్ అంటే నాకు ప్రేమ అని గ‌డిచిన ప‌దేళ్ల‌లో ప్ర‌తి ఇంట‌ర్వ్యూలో చెబుతున్నా. అలానే నాకు స‌మాజసేవ అన్నా చాలా ఇష్టం. అందుకే.. న‌క్ష‌త్ర ఫౌండేష‌న్ ప్రారంభించా. కానీ.. స‌పోర్ట్‌.. ఫండింగ్స్ లేక స‌ర్వీస్ కు బ్రేక్ ఇచ్చా. స‌మాజ‌సేవ చేయాల‌న్న ఆశ మాత్రం చావ‌లేదు. ప‌వ‌న్ అంటే నాకు అంత ఇష్టం ఉన్న‌ప్పుడు.. ఒక వ్య‌క్తిగా ఆయ‌నే జ‌న‌సేన స్థాపించిన‌ప్పుడు నేను ఎందుకు స‌పోర్టు చేయ‌కూడ‌దు. ప‌వ‌న్ కోసం నేను దేనికైనా రెఢీ" అంటూ మాధ‌వీల‌త పేర్కొన్నారు.

ప‌వ‌న్ మీద అంత ప్రేమ.. అభిమానం ఉన్న‌ప్పుడు పోస్టులు పెట్టి ఆహ్వానించాల‌న్న ఆశ ప్ర‌ద‌ర్శించే క‌న్నా.. మిస్డ్ కాల్ ఇచ్చేసి పార్టీలో చేరిపోతే స‌రిపోయేది క‌దా? మ‌రి.. మాధ‌వీల‌త ఇంత ఓపెన్ గా పోస్ట్ పెట్టిన త‌ర్వాత అయినా ప‌వ‌న్ ఆమెను ఆహ్వానించి పార్టీలో చోటు ఇస్తారో? లేదో..? చూడాలి.