Begin typing your search above and press return to search.

సాధినేని యామినికి పదవి ఇవ్వడంపై మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్...?

By:  Tupaki Desk   |   11 Jun 2020 10:30 AM GMT
సాధినేని యామినికి పదవి ఇవ్వడంపై మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్...?
X
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. 'అతిథి' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి మాధవీలత 'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత 'స్నేహితుడు' 'అరవింద్ 2' లాంటి అడపాదడపా సినిమాల్లో నటించింది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత జాతీయ పార్టీ బీజేపీలో చేరింది. అప్పటి నుండి రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఈ భామ అదే పార్టీకి చెందిన యామిని సాధినేని మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. టీడీపీ నుండి బీజేపీ లో చేరిన యామిని సాధినేనిని ఉద్దేశిస్తూ 'మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా..' అంటూ మాధవీలతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అదీ ఇది కాకుండా ప్రతి విషయంపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌ గా ఉండే మాధవీలత తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చకు దారితీసాయి.

కాగా ఇటీవల బీజేపీలో చేరిన సాధినేని యామినిని 'వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌' లో దక్షిణాది తరుపున అధికార ప్రతినిధిగా నియమించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రస్తావిస్తూ.. ఎలక్షన్స్ కి ముందు ప్రధాని మోడీని తిట్టిన యామినికి పదవులు కట్టబెట్టి ఇన్నాళ్లు పార్టీలో ఉన్న మాధవీలతను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాధవీలత స్పందించి.. ''ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదు.. రికమండేషన్స్ ఉంటే చాలు.. గొప్ప వాళ్లతో పరిచయాలు ఉంటే చాలు.. తప్పుగా చెప్పట్లేదు. పాలిటిక్స్ అనే కాదు క్లర్క్ కానిస్టేబుల్ జాబ్స్ విషయంలో కూడా ఎందులోనైనా రికమండేషన్స్ ఉంటాయి. నాకు గొప్పవాళ్లు ఎవ్వరూ లేరూ రికమండ్ చేయడానికి, అభిమానులు తప్ప.. ఆలస్యమైనా దేవుడు మంచి చేస్తాడు. దేశం గుర్తించేంత గొప్పగా.. టీవీ ఛానల్స్ అన్ని మారుమోగిపోయేలా.. కష్టానికి కాలం పడుతుంది. కానీ వెయిట్ చేయాలి.. నాపై అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీకు థ్యాంక్స్'' అని సమాధానం ఇచ్చింది. సాధినేని యామినికి రికమండేషన్స్ వల్లనే పదవి వచ్చిందని చెప్పకనే చెప్పింది. మరి మాధవీలత వ్యాఖ్యలపై బీజేపీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.