Begin typing your search above and press return to search.

మా అల్లుడు వెరీ గుడ్‌ అంటున్న హీరోయిన్ తల్లి

By:  Tupaki Desk   |   27 Dec 2021 12:30 AM GMT
మా అల్లుడు వెరీ గుడ్‌ అంటున్న హీరోయిన్ తల్లి
X
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గానే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక చోప్రా తన కంటే పదేళ్ల వయసు చిన్న వ్యక్తిని వివాహం చేసుకున్న సమయంలో అంతా కూడా ఖచ్చితంగా వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవదు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. నిక్ ఆస్తి కోసం.. అతడి కి ఉన్న గుర్తింపు కోసం పెళ్లి చేసుకుందని ప్రియాంక చోప్రాను కొందరు విమర్శించారు. ఆస్తి విషయంలో నిక్ చాలా పై స్థాయిలోనే ఉన్నాడు... కాని ప్రియాంక చోప్రా కూడా తక్కువేం కాదు. ఆమె ఆస్తులు కూడా భారీగానే ఉంటాయి. రోజులు గడుస్తున్నా కొద్ది వీరి వివాహ బంధం మరింతగా బలంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆమద్య వీరిద్దరి మద్య గొడవలు వచ్చాయి.. విడి పోతారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని వీరిద్దరు తమ అనుబంధంతోనే సమాధానం చెప్పేశారు.

ప్రియాంక చోప్రా తన సోషల్‌ మీడియా అకౌంట్స్ నుండి నిక్ పేరును తొలగించడం తో అంతా కూడా షాక్‌ అయ్యారు. ఇద్దరి మద్య ఏదో తేడా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో వారిద్దరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టి తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. తాజాగా మరోసారి వారిద్దరి బంధం గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈసారి ప్రియాంక చోప్రా అమ్మ గారు అయిన మధు చోప్రా స్పందించారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా అల్లుడు వెరీ గుడ్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. నా అల్లుడు చాలా జీనియస్‌.. చాలా నెమ్మదస్తుడు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు.

మీడియాలో వచ్చే ఏ ఒక్క వార్తను నమ్మవద్దని ఆమె కోరారు. మీడియా వారు ఇష్టానుసారంగా వార్తలు రాయడంను కూడా తప్పుబట్టారు. తన అల్లుడు ప్రతి విషయంలో కూడా ఆచి తూచి ఆలోచించి మాట్లాడుతాడు.. ప్రతి విషయంలో కూడా అతడికి లోతైన పరిజ్ఞానం ఉందని చెప్పుకొచ్చింది. ప్రతి విషయంలో కూడా అతడి నిర్ణయాలు సరైనవి అవుతాయని కూడా అల్లుడు గురించి చెప్పుకొచ్చింది. అతడి తెలివి తేటల విషయంలో ప్రధానంగా ఆమె మాట్లాడటం జరిగింది. అన్ని విషయాలను కూడా లోతుగా ఆలోచించడం అంటే మామూలు విషయం కాదు.. అందుకే ప్రియాంక చోప్రా చాలా లక్కీ అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.