Begin typing your search above and press return to search.
#తలైవి జానకి రామచంద్రన్ గా మధూ లుక్
By: Tupaki Desk | 26 March 2021 1:30 PM GMTదివంగత కథానాయిక.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో తెరకెక్కుతున్న సినిమా `తలైవి`. ఈ చిత్రంలో కంగన టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు.తాజాగా మధుబాల కొత్త లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. నేడు మధుబాల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తలైవి నుంచి మాధూ పాత్ర కొత్త పోస్టర్ ను కంగన షేర్ చేశారు.
ఇప్పటికే తలైవి ట్రైలర్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. తాజాగా కొత్త పోస్టర్ ను పంచుకుంటూ కంగనా రనౌత్ బృందం "పుట్టినరోజు శుభాకాంక్షలు మాధూ" అన్న వ్యాఖ్యను జోడించింది. ఈ పోస్టర్ లో మాధూ సాధారణ కాటన్ ప్రింటెడ్ చీర ధరించి కనిపిస్తున్నారు. ఎంజీఆర్ (అరవింద్ స్వామి) పక్కన కూర్చుని ఏదో మంతనం సాగిస్తున్నారు. ఎంజీ రామచంద్రన్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు భార్య జానకి (మధుబాల) అతనిని కలుసుకున్నప్పటి దృశ్యమది. ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీఆర్ కి తమిళ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. ఆయన మరణానంతరం పరిణామాలు ఆసక్తికరం.
ఎంజీఆర్ తో జయలలిత బంధం ఎలా అభివృద్ధి చెందిందో ఇదివరకూ ట్రైలర్ లో ఆవిష్కరించారు. కథానాయికగా ఆరంగేట్రం సహా రాజకీయ నాయకురాలిగా జయలలిత జీవితంలో ఎదుగుదలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సహకారంతో విబ్రీ మీడియా సంస్థ నిర్మిస్తోంది. హిందీ- తమిళం- తెలుగు భాషల్లో 2021 ఏప్రిల్ 23 న సినిమా విడుదల కానుంది.