Begin typing your search above and press return to search.
కమెడియన్ లాంగిటివిటీ అందుకే లేదు!!
By: Tupaki Desk | 9 March 2019 5:30 PM GMTగత కొంతకాలంగా టాలీవుడ్ కామెడీలో అనూహ్యమైన మార్పు గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి కాలంలో ఉన్న కామెడీ ఇప్పుడు లేదు. పూర్తిగా బూతు కామెడీ.. అశుద్ధం రాజ్యమేలుతోంది అన్న విమర్శ బలంగా ఉంది. జబర్థస్త్ రాకతో వెకిలి హిజ్రా కీమెడీ పుట్టుకొచ్చి దారుణం అయిపోయిందని విమర్శించడం వింటున్నదే. ఇప్పుడొస్తున్న కమెడియన్లలో సుదీర్ఘ కాలం (లాంగిటివిటీ) నిలబడే కమెడియన్లు లేకపోవడంపైనా విమర్శలున్నాయి. నేడు కనిపించిన కమెడియన్ కొన్నాళ్ల తర్వాత ఉంటారా ఉండరా? అన్న విమర్శ కూడా ఉంది.
ఇదే ప్రశ్న టాలీవుడ్ యువ కమెడియన్లు ప్రవీణ్ (కొత్త బంగారు లోకం ఫేం) - మధు(గుండె జారి గల్లంతయ్యిందే ఫేం)ని ప్రశ్నిస్తే .. ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మీడియా విమర్శ సద్విమర్శనే. అది నిజమే. అయితే ప్రస్తుతం కాలంతో పాటే వచ్చిన మార్పు ఇది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు ట్యాలెంట్ ని ప్రదర్శించేందుకు - బయటి ప్రపంచానికి తెలిసేందుకు సామాజిక మాధ్యమాలు - యూట్యూబ్ లు - వాట్సాప్ లు బోలెడన్ని ఆప్షన్ ఉన్నాయి. దీని వల్ల ప్రపంచం నలుమూలల నుంచి కమెడియన్లు పరిచయం అయిపోతున్నారు. ఆర్టిస్టుల వెల్లువ తీవ్రంగా ఉంది. దీనివల్ల పరిశ్రమలో బోలెడంత కాంపిటీషన్ పెరిగింది. ఇదివరకటిలా కేవలం ఏ కొద్ది మందికో స్టిక్ అయ్యి .. ఎవరో ఒక కమెడియన్ నే ఎంకరేజ్ చేసే పరిస్థితి పరిశ్రమలో లేదు.
బ్రహ్మానందం - అలీ - సునీల్ వంటి కమెడియన్లు సుదీర్ఘ కాలం మన్నికతో పని చేశారు. కానీ వాళ్ల రోజుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతి రోజూ కమెడియన్లు పరిచయం అవుతూనే ఉన్నారు. నటులు పరిచయం అవుతూనే ఉన్నారు. అందువల్ల ఎవరో కొందరికే పరిశ్రమ పరిమితం కాని సన్నివేశం ఉంది! సుదీర్ఘ కాలం ఒకే కమెడియన్ ఇండస్ట్రీని ఏలే పరిస్థితి ఇప్పుడు లేనేలేదు అని చెప్పారు. బ్రహ్మీ - అలీ టైమ్ లో వాళ్లకు ఒకసారి ఫేం వచ్చాక వీళ్లే కమెడియన్లు అంటే అనుకునే సన్నివేశం ఉండేది. ఇప్పుడలా లేనేలేదు.. అని చాలా ఫ్యాక్ట్స్ నే చెప్పారు. ఇక కామెడీని క్రియేట్ చేసే క్రియేటర్లు అయిన రచయితలు - దర్శకుల వల్ల కూడా కమెడియన్ ఇమేజ్ మారుతుందని అన్నారు. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరూ హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. తమకు మాత్రం కమెడియన్లుగా కెరీర్ హ్యాపీగా ఉందని ప్రవీణ్ - మధు తెలిపారు.