Begin typing your search above and press return to search.

దీపిక-మాల్యా.. ఐతే సినిమా రసవత్తరమే

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:42 AM GMT
దీపిక-మాల్యా.. ఐతే సినిమా రసవత్తరమే
X
విజయ్ మాల్యాకు బడా వ్యాపారవేత్తగానే కాదు, రసిక ప్రియుడిగా కూడా బాగా ఫేమస్. ఏటా సెక్సీ మోడల్స్ తో ఆయన లాంచ్ చేసే కింగ్ ఫిషర్ క్యాలెండర్ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇక దీపికా పదుకునే సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ తోనే ఫేమస్ అయి.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. టాఫ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఒకప్పుడు ఎవరి క్యాలెండర్ కోసం మోడల్ గా పని చేసిందో అదే వ్యక్తి కొడుకునే పటాయించి ప్రేమ వ్యవహారం నడిపింది. విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో కలిసి ఆమె ఏకంగా స్టేడియంలోనే లిప్ కిస్సులు లాగించిన వైనాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఐతే ఈ వ్యవహారాలన్నింటినీ సినిమాగా తెరకెక్కిస్తే ఎంత మజా ఉంటుందో కదా.

రియలిస్టిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మధుర్ భండార్కర్ ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘క్యాలెండర్ గర్ల్స్’కు స్ఫూర్తి విజ్ మాల్యా, దీపికా పదుకునేల జీవితాలే అని సమాచారం. ఇంతకుముందు ఫ్యాషన్ సినిమాతో గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే మురికినంతా బయటపెట్టి సంచలనం సృష్టించాడు మధుర్. ఇప్పుడు ఆయన దృష్టి క్యాలెండర్ మోడల్స్ మీద పడింది. అందులోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇద్దరు వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమా తీస్తున్నారు. క్యాలెండర్ గర్ల్ గా ఒక్కసారిగా తార స్థాయికి చేరిన మోడల్స్ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో చూపించబోతున్నానని.. ఐతే ఎవరినీ చెడుగా చూపించే ఉద్దేశం తనకు లేదని అంటున్నాడు మధుర్. ఐతే దీపిక, మాల్యాల గురించి మధుర్ ఏం చూపిస్తాడా అని బాలీవుడ్ జనాలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.