Begin typing your search above and press return to search.
సినీ టాక్: రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న
By: Tupaki Desk | 17 July 2017 5:32 AM GMTవాస్తవికతను వెండితెరపై ఆవిష్కరించండలో.. దర్శకుడు మధుర్ భండార్కర్ కు బోలెడంత గుర్తింపు ఉంది. పేజ్3.. ఫ్యాషన్.. హీరోయిన్.. ఇలా అనేక చిత్రాలను జనాలకు తెలియని రియలిస్టిక్ యాంగిల్ నుంచి తీసి మెప్పించాడు. మధుర్ భండార్కర్ తాజా చిత్రం మాత్రం బోలెడన్ని వివాదాలను ఫేస్ చేయాల్సి వస్తోంది.
ఇందు సర్కార్ అంటూ.. ఇందిరా గాంధీ పాలనలోని కొంత కాలాన్ని సినిమాగా రూపొందించాడు మధుర్ భండార్కర్. 1975-77 కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే.. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇందు సర్కార్ కు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటే.. ప్రతీ చోటా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఇది మధుర్ భండార్కర్ కు విసుగు తెప్పించేయడంతో.. నేరుగా రాహుల్ గాంధీనే నిలదీసేశాడు.
'మొదట పూణే.. ఆ తర్వాత నాగ్ పూర్.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి గూండాగిరీని మీరు సపోర్ట్ చేస్తారా? నాకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా?' అంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశాడు మధుర్ భండార్కర్. అప్పటి కాలాన్ని బేస్ చేసుకుని రైటర్లు పుస్తకాలు రాశారు. అనేకమంది డాక్యుమెంటరీలు రూపొందించారు. నేను సినిమా ఎందుకు తీయకూడదు? 3 నిమిషాల లెంగ్త్ ఉన్న ట్రైలర్ చూసి ఇలా ప్రవర్తిస్తారా.. ఈ చిత్రంలో 70 శాతం కల్పిత సన్నివేశాలే' అన్నాడు ఈ రియలిస్టిక్ డైరెక్టర్.