Begin typing your search above and press return to search.
అప్సెట్ అయిన మధుర శ్రీధర్.. క్రిటిక్స్ కు చిన్న క్లాసు!
By: Tupaki Desk | 14 July 2019 5:54 AM GMTఆనంద్ దేవరకొండ.. శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'దొరసాని' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ కు ముందు చాలామంది న్యూ జెన్ డైరెక్టర్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే రిలీజ్ అయిన తర్వాత సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా నేపథ్యం.. మ్యూజిక్.. రియలిస్టిక్ ఫీల్.. శివాత్మిక యాక్టింగ్ లాంటి వాటిని మెచ్చుకున్నారు కానీ సినిమా స్టొరీ రొటీన్ అని పెదవి విరిచారు.
ఈ రివ్యూలతో రేటింగులతో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అప్సెట్ అయ్యారు. 'దొరసాని' సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని.. ప్రేక్షకుల ఆదరణ దక్కుతోందని తెలిపారు. అయితే కొన్ని రివ్యూస్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. "సినిమా బాగుందని.. కథ బాగుందని అంటున్నారు కానీ రాజు పాత్రకు ఆనంద్ సరిపోలేదు.. ఈ కథకు పెద్ద హీరో అయితే బాగుండేదని కొందరు అంటున్నారు. క్రిటిక్స్ సినిమా ను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివ్యూ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఆనంద్ నిబద్దత గురించి మనం మాట్లాడుకోవాలి. అమెరికాలో జాబ్ రిజైన్ చేసి వచ్చి.. ఇక్కడ ఐదారు నెలలపాటు వర్క్ షాప్స్ హాజరై ఆ పాత్రకు ప్రిపేర్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఏదో హీరోయిజం ఉండే సినిమాను ఎంచుకోకుండా ఒక సాధారణ కూలి కొడుకు రాజు పాత్ర ను ఎంచుకున్నాడు. ఒక న్యూడ్ సీన్ లో నటించడానికి వెనుకంజ వేయలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అయింది. ఇన్నేళ్ళలో నేను ఒక వ్యక్తిని ఇలా అంత ధైర్యంగా న్యూడ్ సీన్ లో నటించడానికి కూడా రెడీ అయిన నటుడిని చూడలేదు. ఇంతకంటే కమిట్మెంట్ ఉన్న నటుడు ఎవరున్నారు?" అని కాస్త ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
రివ్యూలు ఎలా ఉన్నా.. విమర్శకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఫిలిం మేకర్స్ తమ సినిమాను క్లాసిక్ అని చెప్పుకున్నా సినిమా సక్సెస్ ను నిర్ణయించేది అంతిమంగా ప్రేక్షకులే. సినిమాకు వచ్చే కలెక్షన్స్ మాత్రమే హిట్.. ఫ్లాప్ అనేవాటిని నిర్ణయిస్తాయి. మరి వారి తీర్పు ఎలా ఉందో తెలియాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడక తప్పదు.