Begin typing your search above and press return to search.
ఇది అసహనం అంటున్న మధుర శ్రీధర్
By: Tupaki Desk | 4 May 2018 10:49 AM GMTఅభిరుచి గల నిర్మాతగా మధుర శ్రీధర్ కు చక్కని గుర్తింపు ఉంది. వ్యక్తిగా కూడా ఎంతో మంది ఆయనను ఇష్టపడతారు. సాధు స్వభావి.. మృదువైన మనసున్న మనిషి టైపులో.. చాలా రకాలుగా ఆయన గురించి చెప్పుకుంటున్నారు సినిమా జనాలు. మరి అలాంటి వ్యక్తిని ఎవరైనా కాదనగలరా?
నటుడు కం ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్.. మధుర శ్రీధర్ ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆ నిర్మాత స్వయంగా వెల్లడించి.. ప్రకాష్ రాజ్ తనను బ్లాక్ చేసిన సంగతి గురించి ఓ స్క్రీన్ షాట్ ద్వారా చూపించారు. "ఈయన అసహనం చూడండి. బహుశా నాకు తెలిసి ట్విట్టర్ లో నన్ను బ్లాక్ చేసిన వ్యక్తి ఈ భూమి మీద ఈయనొక్కడే. నేను చేస్తున్న లాజికల్ ఆర్గ్యుమెంట్ ను ఫేస్ చేయలేకపోతున్నాడు. నేను ఏ పందెం కాయడానికి అయినా రెడీ" అన్నారు మధుర శ్రీధర్.
అంతే కాదు.. జస్ట్ ఆస్కింగ్ రోజులు అయిపోయాయి ప్రకాష్ రాజ్ గారూ.. మీరు ఇప్పుడు బాధ్యత గల నాయకులు కదా.. ఎప్పుడూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని సలహా కూడా ఇచ్చారు మధుర శ్రీధర్. ప్రకాష్ రాజ్ అసహనం విషయంలో మధుర శ్రీధర్ కు సపోర్ట్ గా ఆయన ఫాలోయర్స్ రియాక్ట్ అవుతున్నారు. మీరు పోస్ట్ చేయండి.. నిలదీయండి.. ఎందుకు బ్లాక్ చేశారో మేము ప్రకాష్ రాజ్ కు ట్యాగ్ చేస్తామని చెబుతున్నారు ట్విట్టర్ జనాలు.