Begin typing your search above and press return to search.

కె.సి.ఆర్.. సినిమా వస్తోంది!!

By:  Tupaki Desk   |   20 Oct 2016 7:30 AM GMT
కె.సి.ఆర్.. సినిమా వస్తోంది!!
X
చానాళ్ళ నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్రను ఒక సినిమాగా మలచాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన చరిత్రను ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ఆపాలి.. అసలు వెండితెరపై ఏం చూపించాలి.. వంటి విషయాల్లో క్లారిటీ లేక అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడిక దర్శక నిర్మాత మధుర శ్రీధర్ మాత్రం.. తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా మారిన మూడక్షరాల కె.సి.ఆర్ అనే చరిత్రను సినిమాగా మార్చడానికి కంకణం కట్టుకన్నాడంతే.

''1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను - విన్న ఆనాటి సంగతులు - చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. మహాత్మా గాంధి - మార్టిన్ లూథర్ కింగ్ - నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన - భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను'' అంటున్నాడు శ్రీధర్. 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన తన డైరక్షన్లో షూటింగ్ మొదలుపెట్టి.. 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తారట.

మరి తెలంగాణ ఉద్యమం పైన సినిమా అంటే.. ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సమైఖ్యాంధ్ర పాలకులపై సెటైర్లు.. వగైరా వగైరా ఉండవని అనుకోలేం. ఒకవేళ సినిమా అలా ఉంటే మాత్రం వన్ సైడెడ్ గా ఉండి తెలంగాణ వరకే రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి శ్రీధర్ ఈ యాంగిల్ ను ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/