Begin typing your search above and press return to search.

సీనియర్‌ హీరోయిన్‌ రూ.48 కోట్ల ఇల్లు

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:38 AM GMT
సీనియర్‌ హీరోయిన్‌ రూ.48 కోట్ల ఇల్లు
X
1990 ల్లో బాలీవుడ్‌ సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన్ మాధురి దీక్షిత్‌. ఇప్పటికి కూడా ఈమెకు లక్షల్లో అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు.

ఇంకా ఏదో ఒక మార్గం ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న మాదురి దీక్షిత్‌ ఆదాయం ఇప్పటికి కూడా భారీగానే ఉంటుంది అంటూ ఆమె సన్నిహితులు మరియు బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఆమె సంపాదన విషయంలో ఇంకా కూడా స్టార్‌ హీరోయిన్స్ కి పోటీగానే ఉంది. అందుకే ఈ వయసులో కూడా మాదురి దీక్షిత్‌ ఏకంగా 48 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ముంబై లోని అత్యంత ఖరీదైన ఏరియాలో కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది బాలీవుడ్‌ ఇండస్ట్రీ అన్నట్లుగా నిలిచారు. ఆమె ఇల్లు గురించి ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఈ 55 ఏళ్ల సీనియర్‌ హీరోయిన్‌ కొనుగోలు చేసిన ఇల్లు గురించి జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. మీడియా కథనాల అనుసారంగా ఈమె ఇల్లు విస్తీర్ణం దాదాపుగా 5400 చదరపు అడుగులు. అత్యంత విశాలమైన ఇల్లుగా దీన్ని పేర్కొనవచ్చు.

ఇక ఈమె 53వ అంతస్తులో ఈ ప్లాట్ కొనుగోలు చేసిందట. అపార్ట్‌మెంట్‌ లో ఫుట్‌ బాల్‌ స్టేడియం మొదలుకుని అన్ని రకాల వసతులు ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిస్టం మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా అపార్ట్‌మెంట్‌ లో అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక సముద్రం కు అద్భుతమైన వ్యూ లో కూడా మాధురి దీక్షిత్‌ ఇల్లు ఉంటుందట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.