Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో మాధురీ దంపతులు.. కిక్కిస్తున్న గ్లామరస్ ఫోటోలు..!

By:  Tupaki Desk   |   4 April 2021 1:30 AM GMT
మాల్దీవుల్లో మాధురీ దంపతులు.. కిక్కిస్తున్న గ్లామరస్ ఫోటోలు..!
X
ఈ మధ్యకాలంలో మాల్దీవ్స్ వేకెషన్ కు వెళ్లిన లిస్టులో తాజాగా బాలీవుడ్ యాక్ట్రెస్ మాధురి దీక్షిత్ చేరింది. ఇటీవలే ఆమె తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లి ఆ ఏరియా అంతా ఆమె అందంతో ఆకర్షించింది. అలాగే మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది మాధురి. నిజానికి ఈ హీరోయిన్ గురించి పడిచచ్చేవారు కోట్లలో ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా అందాలతో ప్రేక్షకులను అల్లాడించింది. కానీ ఇప్పుడు ఆమె హీరోయిన్ కాదు కాబట్టి అభిమానులు ఆమెను ఫాలో చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రస్తుతం మాధురి మాల్దీవ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధురి ఫోటోలు చూస్తే మాల్దీవుల్లో ఉష్ణోగ్రతను పెంచినట్లే అనిపిస్తుంది. ఆమె కూల్ షార్ట్స్, షర్టులలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నిజానికి ఇన్‌స్టాగ్రామ్ లో మాధురి ఫోటోలు అత్యంత ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా మాధురి రిసార్ట్‌లో బ్లూ టాప్, బ్లాక్ షార్ట్స్ తో పాటు కలర్ ఫుల్ ష్రగ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను పంచుకుంది. ఆ ఫోటోతో పాటు.. "సోనేవా జానీ నీలి జలాలతో కలర్ కోఆర్డినేటింగ్" అంటూ కాప్షన్ జోడించింది. ఇదిలా ఉండగా.. మాధురి దీక్షిత్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డాక్టర్ శ్రీరామ్ ను 1999లో వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు.. అరిన్, ర్యాన్. ఇటీవలే అరిన్ 18వ యేటలో అడుగుపెట్టగా.. ర్యాన్ 16లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం మాధురీ మాల్దీవ్స్ ఫోటోలు బాలీవుడ్ అభిమానులకు ఫుల్ కిక్కిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక మాధురీ చివరిసారిగా కరణ్ జోహార్ తెరకెక్కించిన కలంక్ మూవీలో కనిపించింది. మరి తదుపరి సినిమా ఏంటనేది ఇంకా ప్రకటించలేదు.