Begin typing your search above and press return to search.

అంత పెద్ద స్టార్లకూ లుక్ టెస్ట్

By:  Tupaki Desk   |   20 April 2018 3:41 AM GMT
అంత పెద్ద స్టార్లకూ లుక్ టెస్ట్
X
ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన నటులకు.. ఏదో అప్పుడప్పుడు ఒకటి రెండు చిన్నచిన్న పాత్రలు చేసిన వారికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు దర్శక నిర్మాతలు లుక్ టెస్ట్ చేస్తుంటారు. ఆ క్యారెక్టర్ కు వాళ్లు సరిగ్గా సూటవుతారా లేదా అని క్లారిటీ రావడం కోసం ఈ టెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొత్త నటులే కాదు.. పాత నటులు సైతం లుక్ టెస్ట్ లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హాలీవుడ్ స్ఫూర్తిగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలైంది.

అమితాబ్ బచ్నన్.. అమీర్ ఖాన్.. మాధురీ దీక్షిత్... నటులుగా వీళ్ల పేర్లు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటనలో వాళ్లకున్న అసమానమైన ప్రతిభ గురించి రెండో ఆలోచన చేయాల్సిన పనేలేదు. ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగలగడం వాళ్లకున్న స్పెషాలిటీ. కానీ ఇప్పుడు వాళ్లే ఓ సినిమా స్టార్ట్ చేయడానికి క్యారెక్టర్ కు తాము ఎంతవరకు సెట్ అవుతారో చూడటానికి లుక్ టెస్ట్ కు వెళ్తున్నారు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కరణ్ జోహార్ తాజాగా మాధురి దీక్షిత్ హీరోయిన్ కళంక్ అనే సినిమా తీస్తున్నాడు. ఆమె కూడా లుక్ టెస్ట్ కు హాజరైంది. స్వయంగా మాధురీయే ఈ విషయం షేర్ చేసింది.

ఇంతకుముందు బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ కు ముందు అమితాబ్ కూడా లుక్ టెస్ట్ కు హాజరయ్యాడు. అమీర్ హీరోగా నటిస్తున్న థగ్ష్ ఆఫ్ హిందూస్థాన్ మూవీకి ముందు హీరో అమీర్ హీరోయిన్లు కత్రినా కైఫ్.. ఫాతిమా సనా షేక్.. అమితాబ్ లకు కూడా లుక్ టెస్ట్ చేశారు. సినిమా డిఫరెంట్ గా తీయాలని అనుకున్నప్పుడు.. హిస్టారికల్ మూవీస్ తీస్తున్నప్పుడు ముందుగా లుక్ టెస్ట్ చేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకే నటులు కూడా దీనికి ఓకే అనేస్తున్నారని బాలీవుడ్ దర్శకుడు ఒకరు చెప్పుకొచ్చారు.