Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ చేసిన 54 ఏళ్ల‌ క్లాసిక‌ల్ దేవ‌త‌..!

By:  Tupaki Desk   |   13 Aug 2021 12:30 AM GMT
మైండ్ బ్లాక్ చేసిన 54 ఏళ్ల‌ క్లాసిక‌ల్ దేవ‌త‌..!
X
ఆమె వ‌య‌సు 54. కానీ ఈ లుక్ చూశాక 24 అని క‌న్ఫ్యూజ్ అవ్వ‌డం ఖాయం. అంత ఛామింగ్ గా బ్యూటిఫుల్ గా క‌నిపిస్తున్నారు వెట‌ర‌న్ న‌టి మాధురి ధీక్షిత్ నీనే. అంత‌కంత‌కు త‌న వ‌యసు త‌గ్గిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా అద్భుత‌మైన డిజైన‌ర్ లెహంగాతో మాధురి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. 54 ఏళ్ల మాధురి ఆల‌స్య‌మ‌య్యే కొద్దీ రంగు రుచి మారే వైన్ లాగా మాధుర్యంతో క‌నిపిస్తున్నార‌ని యూత్ ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మాధురీ ఇన్ స్టా జామ్ అయిపోతోందిప్పుడు. త‌న‌ కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది మొద‌లు వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. ఏజ్డ్ బ్యూటీ మేకోవ‌ర్ స‌ర్ ప్రైజ్ చేస్తోంది. బాటిల్ గ్రీన్- టర్కోయిస్ రంగులలో క్లిష్టమైన ఎంబ్రాయిడరీ చోళీని ధరించి మాధురి ఫ్యాషన్ ని రీడిఫైన్ చేశారంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆ హెయిర్ ని అందంగా డిజైన్ చేసారు. మాధురి సువావ్ మౌవ్ లిప్ కలర్ మెరిసే ఐషాడో యూనిక్ అని ప్ర‌శంసించాలి.

మాధురి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వ‌రుస‌గా రియాలిటీ షోల జ‌డ్జిగా కొన‌సాగుతున్నారు. హిందీ డాన్స్ షో `దీవానే 3` కి జడ్జిగా తిరిగి కొన‌సాగుతున్నారు. ఈ లెహంగా రియాలిటీ వేదిక కోసం ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన‌దే. ఈ లుక్ లో మాధురి అతిలోక సుంద‌రి 2 లా క‌నిపిస్తోంద‌ని ఒక సెక్ష‌న్ అభిమానులు వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక‌వేళ మెగాస్టార్ జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ సినిమా తీస్తే అందులో మాధురికి ఆఫ‌ర్ చేస్తారేమో చూడాలి. ఇక మాధురికి మామ్ శ్రీ‌దేవికి ఉన్న ఆస‌క్తిక‌ర క‌నెక్ష‌న్ గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ క‌థానాయిక‌లుగా వెలిగే క్ర‌మంలో చాలా కాలం దూరంగానే ఉన్నారు. కానీ శ్రీ‌దేవి మ‌ర‌ణానంత‌రం త‌న‌తో స్నేహాన్ని మిస్ చేసుకున్నందుకు చాలా బాధ‌ప‌డ్డాన‌ని మాధురి అన్నారు.