Begin typing your search above and press return to search.

మధురిమకి ఇంకా ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

By:  Tupaki Desk   |   25 Aug 2015 9:35 AM GMT
మధురిమకి ఇంకా ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
X
మధురిమ చాలా ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. 2009లో ఆ ఒక్కడు అంటూ అజయ్ కి జంటగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అఫ్పటి నుంచి ఆరెంజ్ లాంటి పెద్ద సినిమాలు చేసినా కలిసి రాలేదు. ఏడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉంది బ్రేక్ కోసం. తెలుగులోనే కాదు... తమిళం, మళయాళం, కన్నడ భాషల్లోనూ అదృష్టం పరీక్షించుకుంది. బాలీవుడ్ లోనూ కాసిని సినిమాలు ట్రై చేసింది. ఎక్కడా సక్సస్ రాలేదు, కనీసం గుర్తింపు తెచ్చే పాత్ర కూడా దక్కలేదు. దీంతో నిరుత్సాహంలో ఉన్న మధురిమ... అప్పట్లో మారుతీ స్కూల్ లో ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసింది.

బెస్ట్ యాక్టర్స్ అనే మూవీలో నందు, షామిలి, కృతిలతో కలిసి నటించింది మధురిమ. అసలే మారుతీ బ్యానర్. అందులో మూవీస్ ఎలా ఉంటాయో తెలుసు. అందుకే అడగ్గానే... అన్నిటికీ తెగించి సినిమా చేసేసింది. మితిమీరిన ఎక్స్ పోజింగ్, టూపీస్ లు, సింగిల్ పీస్ లు అన్నిటినీ ట్రై చేసేసింది. బెస్ట్ యాక్టర్స్ సినిమా షూటింగ్ కూడా పూర్తయి పోయింది.

జీవితంలో నిరాశకు గురైన ఓ వ్యక్తి ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఓ ప్రాంతానికి వెళ్తాడు. అలా వెళ్ళిన అతనకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే బెస్ట్ యాక్టర్స్ చిత్ర కథ. అరుణ్ పవర్ దీనికి డైరెక్టర్. నిజానికి ఈ మూవీని ఈనెల 28న రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆ సందడేం కనిపించడం లేదు. ఇప్పట్లో వస్తుందో లేదో కూడా తెలీడం లేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో.. మధురిమకు ఎప్పుడు పేరొస్తుందో.. ఈ ఎక్స్ పోజింగ్‌ ఎప్పుడు కలిసొస్తుందో...