Begin typing your search above and press return to search.

అవకాశాల్లేక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా?

By:  Tupaki Desk   |   15 July 2015 7:37 AM GMT
అవకాశాల్లేక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా?
X
కోలమొహం చిన్నది మధురిమను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. సినిమాలు ఫ్లాపయినా అందం, అభినయం, ఛరిష్మాతో కాసింత గుర్తింపు తెచ్చుకుంది. జనం మర్చిపోతున్నారు అనగానే మత్తెక్కించే ఫోటోషూట్‌తో విరుచుకుపడడం ఈ అమ్మడి హాబీ. అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్‌ని వదిలిపెట్టి బాలీవుడ్‌పై దండయాత్ర మొదలుపెట్టింది అమ్మడు.

ప్రస్తుతం అక్కడ స్నేహితుల అండదండలతో అవకాశాలు అందుకుంటోంది. అన్నట్టు మధురిమ అనుకున్నంత అమాయకురాలేం కాదు. భవిష్యత్‌ గురించి పక్కాగా ప్లాన్‌ చేస్తోంది. అంతేనా భవిష్యత్‌లో దర్శకురాలవ్వడానికి ఇప్పట్నుంచే అన్నిరకాలా శిక్షణ పొందుతోంది. దీనికోసం బాలీవుడ్‌ దర్శకుడు టోని డి సౌజా వద్ద శిష్యరికం చేస్తోంది. అతడు తెరకెక్కిస్తున్న అజార్‌ (క్రికెటర్‌ అజహరిద్దీన్‌ జీవితం) చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అయితే ఈ ఆఫర్‌ ఎలా వచ్చింది? అని ఆరాతీస్తే అమ్మడు ఓ సంగతి చెప్పింది. టోనీ భార్య నేను క్లోజ్‌ ఫ్రెండ్స్‌. టోనీతో ఉన్న పరిచయం వల్లే అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. త్వరలోనే షూటింగ్‌ కోసం బ్రిటన్‌ వెళుతున్నానని చెప్పింది. ఎలాగూ ఖాళీగానే ఉంది కాబట్టి దర్శకత్వంలో అనుభవం గడిస్తే తప్పేం కాదు. భవిష్యత్‌లో ఓ ఎటెంప్ట్‌ చేయొచ్చు.