Begin typing your search above and press return to search.
హాలీవుడ్ నటి అడ్డంగా బుక్
By: Tupaki Desk | 26 Feb 2016 10:30 PM GMTరోజులు మారాయి. ఇప్పుడు పరిస్థితులు గతంలో మాదిరి లేవు. ఏదో అనుకొని ఏదో చేస్తే.. మరేదో అయ్యే పరిస్థితి. తాజాగా హాలీవుడ్ నటి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాడొన్న వ్యవహారం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఏదో అనుకొని పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలువురికి మంట పుట్టిస్తున్నాయి.
తాను దత్తత తీసుకొని పెంచుకుంటున్న ఇద్దరు నల్లజాతి పిల్లల చేత కాళ్లు ఒత్తించుకునే పని చేయించుకుంటున్న ఆమె సరదాగా ఫోటో తీసి.. తల్లి పట్ల పిల్లలు ప్రదర్శిస్తున్న ప్రేమ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసింది. మాడొన్న పడుకొని ఉంటే.. ఆమె పెంచుకుంటున్న నల్లజాతి పిల్లలు రెబీ.. జేమ్స్ ఇద్దరూ ఆమె చెరో కాలిని పట్టుకొని నవ్వుతూ మర్దన చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
తన పిల్లలకు తనతో ఉన్న అనుబంధం గురించి ప్రదర్శించేందుకు పోస్ట్ చేసిన ఫోటో పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లజాతి పిల్లల్ని బానిసలుగా చూసే తత్వానికి నిదర్శనం ఈ ఫోటోలే అంటూ సోషల్ మీడియాలో పలువురు విరుచుకుపడుతున్నారు. అందుకే పోస్ట్ చేసే ఫోటోల్ని తమ కళ్లతో కాకుండా.. లోకం కళ్లతో చేసి బయట పెడితే ఇలాంటి తిప్పలు రావన్న విషయం మాడొన్నాకు ఇప్పటికైనా అర్థమై ఉంటుందా..?