Begin typing your search above and press return to search.
కబాలి రిలీజ్ పై హైకోర్టు స్టే ఇస్తుందా?
By: Tupaki Desk | 21 July 2016 6:03 AM GMTసౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ కూడా మొదలుకాబోతున్నాయి. ఇలాంటి టైమ్ లో.. కబాలికి ఓ ప్రమాదం పొంచి ఉంది. రజినీకాంత్ నే కంగారు పెట్టగల ఆ స్టామినా.. కేవలం మద్రాస్ హైకోర్టుకు మాత్రమే ఉంది.
సుక్ర ఫిలిమ్స్ పార్ట్నర్ అయిన ఆర్.మహాప్రభు.. కబాలి రిలీజ్ నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తాను లింగ సినిమాను పంపిణీ చేసి తీవ్రంగా నష్టపోయానని.. ఆ నష్టం రూ. 89 లక్షలు అని చెబుతున్న ఆయన.. అప్పట్లో తనకు ఈ నష్టం తిరిగి చెల్లిస్తాననే హామీ లభించిందని చెప్పాడు. నిర్మాత రాక్ లైన్ వెంకటేషన్.. హీరో రజినీకాంత్ లు హామీ ఇచ్చినా ఇప్పటివరకూ తనకు డబ్బు చెల్లించలేదు కాబట్టి.. ఇప్పుడు కబాలి మూవీని తన హామీ నెరవేర్చాకే రిలీజ్ చేయాలన్నది ఈయన వాదన. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇప్పటికే హీరో రజినీకాంత్.. నిర్మాత కలైపులి థానులకు నోటీసులు జారీ చేసింది.
గురువారం ఈ పిటిషన్ పై విచారణ జరగనుండగా.. రిలీజ్ సంగతి తేలేది ఈ విచారణ తర్వాతే. శుక్రవారం విడుదలపై కోర్టు కనుక స్టే ఇస్తే.. స్పాట్ సెటిల్ మెంట్ మినహా మరో ఆప్షన్ కబాలి నిర్మాతలకు ఉండదు. అక్కడ రూ. 89 లక్షల నష్టానికే ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టు మెట్లెక్కి రజినీకాంత్ కి నోటీసులు పంపితే.. ఇక్కడ 7 కోట్లకు పైగా లాస్ అంటున్న వాళ్లు మాత్రం.. ఇతర డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టడం కరెక్టేనంటారా? కోర్టుకు వెళ్లలేకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉండుంటాయా అనే ఫిలింనగర్ టాక్.