Begin typing your search above and press return to search.
డైరెక్టర్ శంకర్ కు కోర్టు ఫైన్
By: Tupaki Desk | 6 Sep 2018 8:45 AM GMTప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కు చెన్నై హైకోర్టు 10 వేల రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానాను బ్లూక్రాస్ సొసైటీకి శంకర్ చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా శంకర్‌కు ఈ జరిమానా విధించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే శంకర్‌కు ఈ జరిమానా పెద్ద విషయం కాదు. కాని జరిమానా అంటూ మీడియాలో వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు శంకర్‌కు జరిమానా ఎందుకు, అసలు కథ ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ - ఐశ్వర్య రాయ్ లతో 2010వ సంవత్సరంలో ‘ఎందిరన్’ చిత్రాన్ని శంకర్ తెరెక్కించాడు. ఆ చిత్రం తెలుగులో ‘రోబో’గా విడుదలైన విషయం తెల్సిందే. ఆ చిత్ర కథ తనది అంటూ రచయిత అరూర్ తమిళ్ నందన్ గత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ విషయమై చెన్నై హైకోర్టుకు అరూర్ తమిళ్ నందన్ వెళ్లాడు. కోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతుంది. విచారణకు దర్శకుడు శంకర్ హాజరు కావాల్సిందే అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు మార్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆదేశాలను బేకాతరు చేస్తూ తాను బిజీగా ఉన్నాను అని, ఇతర సినిమాల షూటింగ్‌తో తాను విదేశాల్లో ఉన్నాను అంటూ లాయర్‌తో పలు సార్లు కోర్టుకు శంకర్ చెప్పించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ కేసు విచారణలో కూడా శంకర్ హాజరు కాకపోవడంతో న్యాయమూర్తికి ఆగ్రహం కలిగి జరిమానా విధించాడు. ఈసారి కేసును సెప్టెంబర్ 12కు వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు శంకర్ తప్పనిసరిగా హాజరు కావాలని - అదే సమయంలో ‘ఏందిరన్’ కథ తనదే అనేందుకు సాక్ష్యాధారాలను కూడా తీసుకు రావాల్సిందే అంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి 12వ తారీకు అయినా శంకర్ కోర్టుకు హాజరు అవుతారేమో చూడాలి.