Begin typing your search above and press return to search.

విశాల్ కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.15 కోట్లు కట్టాలని ఆదేశం

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 AM GMT
విశాల్ కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.15 కోట్లు కట్టాలని ఆదేశం
X
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చిక్కుల్లో పడ్డారు. విశాల్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట రూ.15 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్.డీ) తెరవాలని విశాల్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని తెలిపింది.

విశాల్ తమ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా కొత్త సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని లైకా సంస్థ ఆరోపించింది. అంతేకాదు.. తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రునాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ దాఖలు చేసిన పిటీషన్ పై జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

విశాల్ ఒప్పందం ప్రకారం.. తమ డబ్బులు ఇవ్వకుండా ‘వీరమే వాగై సుడుం’ సినిమా రిలీజ్ చేయడానికి శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయానికి విశాల్ సిద్ధమయ్యారని.. వాటిపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారించిన జస్టిస్ సెంథిల్ కుమార్ .

లైకా ప్రొడక్షన్స్ కు ప్రతివాది రూ.21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్ లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ.12 కోట్లు తీసుకున్నారని.. తర్వాత రూ.3 కోట్లు తీసుకున్నారని.. కాబట్టి రూ.21.29 కోట్ల క్లెయిమ్ సరైనది కాదని తరుఫు న్యాయవాది వాదించారు.