Begin typing your search above and press return to search.

విజయ్ కి చివరకి ఉపశమనం... అసలు ఏమి జరిగింది ?

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:03 AM GMT
విజయ్ కి చివరకి ఉపశమనం... అసలు ఏమి జరిగింది ?
X
కోలీవుడ్ అగ్రనటుల్లో ఒకడిగా.. స్టార్ స్టేటస్ ఉన్న విజయ్ కు తాజాగా మద్రాస్ హైకోర్టును ఊరట లభించింది. అతగాడికి షాకింగ్ గా మారిన ఆదాయపన్ను అధికారుల తీరుకు ప్రతిగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఆయనకు స్టే జారీ చేసిన వైనం ఆయనకు సానుకూలంగా మారింది. ఆ మధ్యన ఆదాయపన్ను శాఖ అధికారులు విజయ్ ఇంటి మీదా.. కార్యాలయం మీదా తనిఖీలు నిర్వహించడం తెలిసిందే.

అతడి లెక్కలు తేడాగా ఉన్నట్లుగా పేర్కొంటూ అతడిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రూ.1.5 కోట్ల జరిమానాను విధించారు. 2016-17లో తన ఆదాయం రూ.35.42 కోట్లుగా ఐటీకి లెక్కలు చూపించినట్లు చెబుతారు.

ఈ లెక్కల్లో విజయ్ తాన నటించిన పులి చిత్రానికి రెమ్యునరేషన్ కింద రూ.15 కోట్లు తీసుకున్నట్లుగా చూపించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో లెక్కల్లో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ అతడికి రూ.1.5 కోట్ల ఫైన్ విధించారు. దీనిపై స్టే ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాు విజయ్. 2017లో సోదాలు నిర్వహించి 2019లో ఫైన్ ఎలా వేస్తారంటూ ఆయన హైకోర్టు ఎదుట తన వాదనలు వినిపించారు.

తాను తప్పు చేసి ఉంటే.. ముందుగా నోటీసులు ఇచ్చి ఉండాలన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ బెంచ్.. ఆలస్యంగా ఫైన్ విధించిన అంశంపై ఐటీ అధికారుల ఉత్తర్వులకు స్టే మంజూరు చేశారు. అదే సమయంలో ఈ ఇష్యూ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారం విజయ్ కు ఊరట కలిగిస్తుందన్న మాట వినిపిస్తోంది.