Begin typing your search above and press return to search.
నడిగర్ సంఘం ఎన్నికల పై వీడిన ఉత్కంఠ!
By: Tupaki Desk | 22 Jun 2019 8:51 AM GMTతమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన నడిగర్ సంఘం ఎన్నికలు ఈ ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తలపడుతున్న పాండవార్ జట్టు, స్వామి శంకర్ దాస్ జట్టులు వాగ్యుద్ధానికి దిగాయి. దీంతో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తే అవకాశం వుందని గమనించిన ఓ అధికారి నడిగర్ సంఘం ఎన్నికల్ని నిలిపివేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై పాండవార్ జట్టు రిట్ పిటీషన్ దాఖలు చేసింది. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు 23న యధావిధిగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టరాదని తేల్చి చెప్పింది.
దీంతో పాండవార్ జట్టు హర్షం వ్యక్తం చేసింది. గత ఎన్నికల్లో విశాల్ వర్గం విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నడిగర్ సంఘంలో ఏదో ఒక వివాదం తలెత్తుతూ సంచలనంగా మారుతోంది. ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విశాల్ శరత్ కుమార్ పై విమర్శలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన వరలక్ష్మీ విశాల్ ని ట్విట్టర్ వేదికగా కడిగిపారేసిన విషయం తెలిసిందే. తరువాత నటి రాధిక కూడా విశాల్ పై విరుచుకుపడింది. దర్శకుడు భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి చేయిదాటేలా వుందని గమనించిన ఓ అధికారి కోర్టు మెట్లెక్కడంతో మద్రాస్ హైకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పునివ్వడం ఆసక్తికరంగా మారింది.