Begin typing your search above and press return to search.
స్టార్ హీరోకు షాకిచ్చిన హైకోర్టు.. ఆధారాల్లేవంటూ సమన్లు జారీ
By: Tupaki Desk | 3 May 2022 3:30 PM GMTతమిళ స్టార్ హీరో ధనుష్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవలే భార్యకు విడాకులు ఇచ్చిన ధనుష్ కు ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల మధురైలోని మేలూరుకు చెందిన కతిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ మూడో కుమారుడు అంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు నకిలీవని పేర్కొంటూ కోర్టు మెజిస్ట్రేట్ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ కతిరేశన్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హీరోకు సమన్లు పంపింది హైకోర్టు.
ఇప్పటివరకూ ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులు విచారణ జరిపించాలని కతిరేశన్ డిమాండ్ చేశారు. దీంతో ధనుష్ కు సమన్లు జారీ చేసింది కోర్టు.
దక్షిణ తమిళనాడులోని మధురైకి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకేనని.. చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయాడని కోర్టులో ఫిర్యాదు చేశారు. ధనుష్ మాత్రం తాను వాళ్ల కొడుకు కాదని కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ధనుష్ ఎవరి కుమారుడోనన్న ఉత్కంఠ కోర్టులో.. మీడియాలో హైలెట్ అయ్యింది.
హీరో ధనుష్ తమ కొడుకేనని కొద్దిరోజులుగా న్యాయపోరాటం చేస్తున్న మేలూర్ కు చెందిన వృద్ధ దంపతుల కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది. ఈ కేసునుంచి హీరో ధనుష్ కు విముక్తి లభించింది. హీరో ధనుష్ 1983లో జూలై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మీ దంపతులకు జన్మించాడని ధనుష్ ఆధారాలు చూపించారు. ఇవన్నీ పక్కాగా ఉండడంతో ధనుష్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేసింది..
అయితే ధనుష్ పుట్టమచ్చలు తొలిగించుకున్నారని వృద్ధ దంపుతులు కోర్టుకు విన్నవించారు. వీటిని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆధారాలు సరిగ్గా చూపలేదని.. కేవలం పుట్టుమచ్చలతో కేసును బలపరచలేమని కోర్టు వ్యాఖ్యానించింది. లేజర్ ట్రీట్ మెంట్ తో పుట్టుమచ్చలు తొలగించారని వారు వాదించారు.
అయితే ధనుష్ దీన్ని ఖండించారు. తాను డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడినంటూ గతంలో కోర్టుకు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. కానీ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించిందని అప్పీల్ పై కతిరేశన్ ఆరోపించారు.