Begin typing your search above and press return to search.
మాట్లాడలేకున్నా వినలేకున్నా అందరు తన గురించే మాట్లాడేలా, వినేలా చేసింది
By: Tupaki Desk | 17 Feb 2020 8:30 PM GMTతమిళ బుల్లి తెరపై ‘కోటీశ్వరి’ అనే ఒక మహిళల గేమ్ షో ప్రసారం అవుతుంది. కలర్స్ లో ప్రసారం అయ్యే ఆ గేమ్ షోకు సీనియర్ హీరోయిన్ రాధిక హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కౌన్ బనేనా కరోడ్ పతీలాగే ఉండే ఈ గేమ్ షో మహిళలకు మాత్రమే. ఈ గేమ్ షో తో రాధిక చాలా ఫేమస్ అవ్వడంతో పాటు ఎంతో మంది మహిళల జీవితాలు వారి ప్రతిభ బయటకు వస్తుంది. దాంతో తమిళనాట ఈ షోకు మంచి ఆధరణ దక్కుతుంది. తాజాగా ఈ గేమ్ షోలో కౌసల్య కార్తీక కోటి రూపాయలు దక్కించుకుంది.
ఇంతకు ముందు కూడా ఈ గేమ్ షో లో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కాని కౌసల్య కార్తీక చాలా చాలా స్పెషల్. ప్రపంచంలోనే మొదటి సారి ఇలాంటి గేమ్ షో లో గెలిచిన మహిళగా కౌసల్య నిలిచింది. కోటి రూపాయలు గెలిచిన కౌసల్య ఇతరుల మాటలను వినలేదు.. ఇతరులతో తాను అనుకున్నది చెప్పలేదు. బదిక మహిళ అయిన కౌసల్య తన ప్రతిభతో అద్బుతమైన మేదస్సుతో కోటి రూపాయలు దక్కించుకుంది. చిన్నప్పుడే మాట.. వినికిడి శక్తిని కోల్పోయినా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకుంది. ఆమెకు స్నేహితులు కూడా సపోర్ట్ గా నిలవడంతో పాటు అమ్మ ఇంట్లో టీచర్ గా మారి ఆమెకు అర్థం అయ్యేలా పెదాలు కదిలిస్తూ పాఠాలు చెప్పేది.
పదవ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కౌసల్య రెగ్యులర్ కాలేజ్ లకు వెళ్లింది. అక్కడ విద్యార్థులు కూడా ఆమెకు సహకరించడంతో బీఎస్సీ.. ఎంబీఏ ఇలా ప్రతి దాంట్లో కూడా టాప్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంను కూడా సంపాదించిన కౌసల్య రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఏడాది బాబు కూడా ఉన్నాడు. బాబు మాటలు వినలేక పోతున్నాను అనే భాధ ఆమెకు ఉన్నా కూడా ఏమాత్రం నిరుత్సాహం లేకుండా తాను అనుకున్న దారిలో ముందుకు సాగింది.
ఒక రోజు పేపర్ లో కోటీశ్వరి గేమ్ షో గురించి యాడ్ చూసిన కౌసల్యకు ఆసక్తి కలిగింది. తనలాంటి వారికి అవకాశం ఉంటుందో లేదో అనుకుంటూ అప్లై అయితే చేసింది. బదిర మహిళ నుండి అప్లికేషన్ రావడంతో షో నిర్వాహకులు కూడా ఆసక్తి చూపించారు. ఆమెకు ప్రత్యేకంగా రూల్స్ మార్చి ఆమెను షోలోకి తీసుకు వచ్చారు. అయితే ఆమె కోటి రూపాయలు గెలుస్తుందని ఎవరూ హించలేదు. రాధిక అడిగిన ప్రశ్నలకు ఒక బోర్డు మీద రాసి చూపిస్తూ సమాధానం ఇచ్చింది. ప్రశ్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను అబ్బుర పర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాటలు రాకున్నా.. ఇతరుల మాటలు వినలేకున్నా కూడా కౌసల్య ప్రస్తుతం ఇతరులు తన గురించిమ ఆట్లాడుకునేలా.. ఇతరుల నుండి కౌసల్య గురించి వినేలా చేసుకుంది.
కోటి రూపాయలు గెలిచిన కౌసల్య తాను చదువుకున్న బదిర పాఠశాలకు కొంత సాయం చేస్తాను అంది. అలాగే విహార యాత్రకు వెళ్లడంతో పాటు సొంత ఇల్లు కొనుక్కుంటానంటూ చెప్పుకొచ్చింది. కౌశల్యతో గేమ్ ఆడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రాధిక చెప్పుకొచ్చింది.