Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' ఫస్ట్ గ్లిమ్స్: అంధుడైన పియానో ప్లేయర్ వెనకున్న అసలు కథేంటో..!

By:  Tupaki Desk   |   30 March 2021 4:16 PM IST
మాస్ట్రో ఫస్ట్ గ్లిమ్స్: అంధుడైన పియానో ప్లేయర్ వెనకున్న అసలు కథేంటో..!
X
యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ''మాస్ట్రో''. ఇది హిందీ సూపర్ హిట్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నల్ల కళ్ళద్దాలు ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని ఉన్న నితిన్ లుక్ ని చూస్తే ఇందులో అతను ఓ అంధుడేమో అనే డౌట్ కలిగించారు. అలానే పియానోపై రక్తపు మరకలు కనిపించడంతో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనే హింట్ ఇచ్చారు. అలానే మరో పోస్టర్ లో నితిన్ కళ్ళద్దాలలో రక్తపు మడుగులో పడివున్న ఓ శవం నీడ కనిపించడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

ఈ నేపథ్యంలో నితిన్ బర్త్ డే స్పెషల్ గా ఓ గ్లిమ్స్ ని 'మాస్ట్రో' చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో నితిన్ అంధుడైన ఓ వాద్య కళాకారుడిగా పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఓ పిల్లి పియానో పై కాలు పెట్టగా.. నితిన్ ఓ వాటర్ టబ్ లో తల పెట్టి భయభయంగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అతని రెండు కళ్ళు తెల్లగా మారిపోవడం చూస్తుంటే ఎవరో కావాలనే తన చూపుని పోగొట్టడానికి విష ప్రయోగం చేసారేమో అనిపిస్తుంది. దీనికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం.. జె.యువ‌రాజ్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద ఈ గ్లిమ్స్ తోనే 'మాస్ట్రో' మేకర్స్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారని చెప్పవచ్చు. నితిన్ చూపు వెనకున్న అసలు కథ తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ''మాస్ట్రో''లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషిస్తోంది. సీనియర్ న‌రేష్‌-జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌-హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి-మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ కెరీర్లోనే డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న 'మాస్ట్రో' సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.