Begin typing your search above and press return to search.
ఆ సినిమాపై కోర్టుకెక్కిన మగధీర
By: Tupaki Desk | 24 May 2017 6:25 PM GMTటాలీవుడ్ రికార్డులు అన్నిటినీ తిరగరాసేసి.. కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీ మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ రికార్డులు ఆరేళ్లకు పైగా పదిలంగా ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతోందని తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్- కృతి సనోన్ జంటగా రాబ్తా మూవీని నిర్మించాడు దర్శకుడు దినేష్ జైన్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మగధీరకు అనధికారిక కాపీ అనే టాక్ వచ్చేసింది. రెండు జన్మల ప్రేమ కథ.. గత జన్మలో రాజుల కాలంలో వైరం.. ఈ జన్మలో మళ్లీ ప్రేమించుకోవడం.. మొత్తం థీమ్ అంతా మగధీర చిత్రానిదే కనిపిస్తోంది. నిజానికి మగధీరను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. మధు మంతెన దగ్గర ఈ రీమేక్ రైట్స్ ఉన్నాయి.
కానీ రాబ్తా చిత్రం మగధీర లైన్ లోనే ఉండడంతో.. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలంటూ గీతా ఆర్ట్స్ కోర్టు మెట్లు ఎక్కిందని అంటున్నారు. కాపీరైట్ చట్టం ప్రకారం కేసు దాఖలు చేయగా.. ఇప్పటికే విచారణ నిర్వహించి.. రాబ్తా మేకర్స్ కు హైద్రాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 1న తదుపరి విచారణ జరగనుండగా.. జూన్ 9న రాబ్తా విడుదల సాఫీగా ఈ లోగా ఈ కేసును పరిష్కరించుకోవాల్సిన అవసరం మేకర్స్ కు ఉంది.