Begin typing your search above and press return to search.

మగధీర వర్సెస్ రాబ్తా: సెటిలైంది కాని..

By:  Tupaki Desk   |   8 Jun 2017 8:55 AM GMT
మగధీర వర్సెస్ రాబ్తా: సెటిలైంది కాని..
X
హిందీలో రేపు రిలీజ్ కానున్న 'రాబ్తా' సినిమా ట్రైలర్ ను చూస్తే యాజిటీజ్ 'మగధీర' సినిమాయే గుర్తొస్తుంది. కేవలం 2 నిమిషాల ట్రైలర్ చూసి రెండున్నర గంటల సినిమా అంతా కాపీయే అని ఎలా అంటారు అంటూ రాబ్తా తరుపున వాదించిన లాయర్లు అందరూ చెప్పుకొచ్చారు కాని.. ట్రైలర్ చూస్తే మాత్రం క్యారక్టర్లన్నీ మగధీర నుండి తీసుకున్నవే అన్నట్లు ఉన్నాయి. అయితే ఈరోజు కోర్టులో ఈ కేసుకు సంబంధించి తీర్పు రాబ్తా నిర్మాతలకు ఫేవర్ గా రావడంతో.. రేపు సినిమా యథాతథంగా రిలీజవుతోంది.

ఇప్పుడు కోర్టు 'రాబ్తా' సినిమా అనేది తెలుగులో తాము తీసిన 'మగధీర' సినిమాకు కాపీ అంటూ గీతా ఆర్ట్స్ వారు వేసిన కేసును కొట్టేసిందని ఒకరు.. లేదు గీతా ఆర్ట్స్ వారే కేసును విత్ డ్రా చేసుకున్నారని ఒకరు.. కోర్టు బయట సెటిల్మెంట్ జరిగిందని ఒకరు రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇంతకీ వీటిలో ఏది నిజం? ఒక వర్గం మీడియా మాత్రం.. డైరక్టర్ దినేష్‌ విజాన్ ఈ సినిమాను ప్రత్యేక ప్రివ్యూ వేసి అల్లు అరవింద్ కు చూపించారని.. ఆ తరువాత అరవింద్ కోర్టు కేసును ఉపసంహరించుకున్నారని చెబుతున్నారు. కాకపోతే మంగళవారం నాడు కోర్టులో ఆర్గుమెంట్లు జరిగినప్పుడు మాత్రం.. అసలు మగధీర సినిమాను తాము కాపీ చేయలేదని రాబ్తా లాయర్లు 5 గంటల పాటు వాదించారట. అంతే కాదు.. మగధీర ఫ్లాష్‌ బ్యాక్ లో కూడా హీరోయిన్ హీరోనే లవ్ చేస్తుంది కాని.. ఇక్కడ మాత్రం ఫ్లాష్‌ బ్యాక్ లో హీరోకు నెగెటివ్ షేడ్ ఉందని.. పైగా సినిమా క్లయ్ మ్యాక్స్ కూడా ఆద్యంతం డిఫరెంట్ గా ఉందని.. రాబ్తాలోని క్యారక్టర్ గ్రాఫ్‌ పూర్తిగా వేరని.. అలాగే మగధీరలోని 100 యోధుల ఫైట్ ను అసలు తాము టచ్ కూడా చేయలేదని రాబ్తా తరుపు లాయర్లు వాధించారు. అప్పుడు కూడా అల్లు అరవింద్ వాటితో ఏకీభవించకపోవడంతో.. ఆయనకు సినిమా చూపించారట.

ఇదిలా ఉంటే.. రాబ్తా కాపీ కొట్టేశారని అంటున్నారు బాగానే ఉంది కాని.. 1998 లో ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చిన 'చందేరీ' అనే నవల్ ను కాపీ చేసి మగధీర తీశారని సదరు రైటర్ ఆరోపిస్తున్నాడుగా.. దాని గురించి కూడా మాట్లాడండి సార్. అల్లు వారే కాదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ యవ్వారంపై సైలెంటుగా ఉండటం కొసమెరుపు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/