Begin typing your search above and press return to search.
జక్కన్న అంటే ఏంటో బాక్సాఫీస్ కు చూపించిన ఫస్ట్ సినిమా..!
By: Tupaki Desk | 1 Aug 2022 9:30 AM GMTభారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాడు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ దర్శకధీరుడు అనిపించుకున్నారు. అయితే జక్కన్న క్రియేటివిటీ ఏంటో జాతీయ స్థాయిలో తెలియజెప్పిన తొలి సినిమా ''మగధీర'' అని చెప్పాలి.
'స్టూడెంట్ నెం.1' చిత్రంతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాజమౌళి.. 'సింహాద్రి' 'సై' 'ఛత్రపతి' 'విక్రమార్కుడు' 'యమదొంగ' వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో ఒక దృశ్యకావ్యంగా మలిచిన 'మగధీర' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ యాక్షన్ ఫిలింగా 'మగధీర' రూపొందింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం.. 2009 జూలై 31న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తూ ఎన్నో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది.
రాజమౌళి క్రియేటివిటీకి ప్రధాన పాత్రల నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. దీంతో 'మగధీర' రూ. 75 కోట్ల షేర్ అందుకొని అప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక గ్రాస్ రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది. అలానే అత్యధిక సెంటర్లలో 50 రోజులు మరియు 100 రోజులు ఆడిన రికార్డ్ కూడా ఈ సినిమా ఖాతాలోనే ఉంది. ఈ సినిమా కొన్ని థియేటర్లలో 1000 రోజులకు పైగా ప్రదర్శించడం విశేషం.
'మగధీర' సినిమా బెస్ట్ కొరియోగ్రఫీ మరియు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో రెండు నేషనల్ అవార్డ్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 'చిరుత' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో సినిమా 'మగధీర' తోనే టాప్ లీగ్ లోకి చేరాడు. ఇందులో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ ఒక్క దెబ్బతో స్టార్ స్టేటస్ అందుకుంది. కీలక పాత్రలు పోషించిన శ్రీహరి - దేవ్ గిల్ లకు మంచి పేరొచ్చింది.
మగధీరకు కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించాగం.. బీవీఎస్ఎన్ ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా.. ఆర్ రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
ఇకపోతే 'మగధీర' సినిమా కోసం 'బంగారు కోడిపెట్ట' పాటను రీమిక్స్ చేయగా.. ఇందులో చరణ్ తో పాటుగా చిరు కనిపించి అభిమానులను ఉత్సాహపరిచాడు. ‘ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి రమ్మను’ అని చరణ్ చెర్రీ పలికిన డైలాగ్ అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.
తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఉర్రూతలూగించిన 'మగధీర' సినిమాకి 13 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #13YrsOfHistoricIHMagadheera అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేస్తూ 'తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గేమ్ ఛేంజర్ కి 13 ఏళ్ళు - దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బ్లాక్ బస్టర్.. బాక్స్-ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది' అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 'మగధీర' సినిమాకు వర్క్ చేసిన ప్రముఖులు ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ RRR చిత్రంలోనూ భాగమయ్యారు. ఇదే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ప్రశంసిస్తున్న విదేశీయులు.. ఇప్పుడు 'మగధీర' చిత్రాన్ని చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.