Begin typing your search above and press return to search.

వైభవంగా మంచు మనోజ్.. మౌనిక ల వివాహం

By:  Tupaki Desk   |   4 March 2023 10:02 AM GMT
వైభవంగా మంచు మనోజ్.. మౌనిక ల వివాహం
X
గత ఏడాది నుండి మంచు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు వెయిట్‌ చేస్తున్న మంచు మనోజ్‌.. భూమా మౌనిక రెడ్డిల వివాహం నిన్న రాత్రి వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మరియు ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మంది ఈ వివాహానికి హాజరు అయ్యారు.

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ లోని మంచు వారి ఇంట్లో ఈ వివాహం వైభవంగా జరిగింది. వివాహానికి హాజరు అయిన అతిథులను మోహన్‌ బాబు దంపతులు సాదరంగా ఆహ్వానిస్తూ కనిపించారు. మనోజ్ మరియు మౌనిక రెడ్డి పెళ్లి వస్త్రాల్లో కన్నుల విందు చేశారు. ఇద్దరు కూడా చూడ చక్కని జంట అన్నట్లుగా కనిపించారు.

పెళ్లి వేడుకలో మంచు లక్ష్మి కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మోహన్‌ బాబు మరియు భూమా ఫ్యామిలీస్ పెద్దవి.. రెండు ఫ్యామిలీస్ కు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున హాజరు అవ్వడం జరిగింది. మౌనిక రెడ్డి సోదరి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తల్లి స్థానంలో ఉండి వివాహం ను నిర్వహించారని తెలుస్తోంది. శాంత బయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి మరియు వైఎస్ విజయమ్మ లు ఈ పెళ్లికి హాజరు అయ్యారు.

అధికారికంగా విడుదల చేసిన ఫొటోల్లో మంచు విష్ణు మరియు ఆయన కుటుంబ సభ్యులు కనిపించక పోవడం చర్చనీయాంశం అయ్యింది. మంచు విష్ణు ఫ్యామిలీ పెళ్లికి హాజరు అయ్యారా అనేది క్లారిటీ లేదు. మంచు ఫ్యామిలీ అంతా కలిసే ఉంటుంది.. విష్ణు దంపతులు కూడా హాజరు అయ్యి ఉంటారు కానీ ఫొటోల్లో కనిపించడం లేదేమో అనేది కొందరి అభిప్రాయం.

వైభవంగా జరిగిన మంచు మనోజ్‌ మరియు భూమా మౌనిక రెడ్డిల వివాహ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు మరియు మీడియా వర్గాల వారు సెలబ్రెటీలు ఫొటోలను షేర్‌ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా తరపున కూడా మనోజ్‌.. మౌనిక లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.