Begin typing your search above and press return to search.
'ప్రభుత్వ గూండాలు నా ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారు'
By: Tupaki Desk | 9 Sep 2020 7:10 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ - శివసేన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు కంగనా క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కంగనాను హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను లెక్క చేయని కంగనా.. 'తాను ముంబై వస్తున్నానని.. దమ్ముంటే అడ్డుకోవాలని' సవాల్ చేసింది. హోం శాఖ కల్పించిన వై కేటగిరి భద్రత నడుమ ఆమె ఇవాళ తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి బయల్దేరింది.
ఇదే సమయంలో ముంబైలోని కంగనాకు చెందిన మణికర్ణిక కార్యాలయాన్ని బృహణ్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుల్డోజర్ తో కూల్చడం స్టార్ట్ చేసారు. ఇప్పటికే కంగనా కార్యాలయం అక్రమ కట్టడమని.. కొన్ని నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదని బీఎంసీ అధికారులు ఆమె ఆఫీస్ గేటుకు నోటీసులు అంటించారు. దీనిపై స్పందించిన కంగనా.. 'బీఎంసీ అధికారులు ఈ రోజు బుల్డోజర్ తో రాలేదు' అని ట్వీట్ చేసింది. ఇక తన కార్యాలయ కూల్చివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కంగనా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. ఇంతలోనే బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రక్రియను మొదలు పెట్టడం గమనార్హం. తన కార్యాలయం కూల్చివేతపై స్పందించిన కంగనా.. 'నేను ముంబై దర్శనం కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నాను. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం - గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారు. కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా సిద్ధం. ఈ కూల్చివేత ఏమీ చేయలేదు. తన స్ఫూర్తి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుంది'' అని ట్వీట్ చేసింది.