Begin typing your search above and press return to search.

'హే తికమక మొదలే' సాంగ్: 'మహా సముద్రం' లో విహరిస్తున్న ప్రేమ పక్షులు..!

By:  Tupaki Desk   |   30 Sep 2021 10:50 AM GMT
హే తికమక మొదలే సాంగ్: మహా సముద్రం లో విహరిస్తున్న ప్రేమ పక్షులు..!
X
'Rx 100' వంటి సెన్సేషనల్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ''మహాసముద్రం''. ఇన్టెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

'మహా సముద్రం' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ - పాటలు - ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'హే తికమక మొదలే' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'హే తికమక మొదలే.. ఎద సొద వినదే.. అనుకుందే తడువా.. ఇక నచ్చి నచ్చి పిచ్చి పట్టి..' అంటూ సాగిన ఈ గీతం వీక్షకులను అలరిస్తోంది. రెండు ప్రధాన జంటల ప్రేమ కథలను తెలియజెప్పడం ఈ సాంగ్ ప్రత్యేకత. ఇందులో శర్వానంద్-అను ఇమ్మాన్యుయేల్ మరియు సిద్ధార్థ్-అదితి రావు హైదరి జోడీలను ప్రేమ పక్షులుగా విహరిస్తున్నట్లు చూపించారు. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

'హే తికమక మొదలే' పాటకు చైతన్ భరద్వాజ్ బాణీలు సమకూర్చారు. 'హే రంభా' పాట మాస్ ని.. 'చెప్పకే చెప్పకే' మెలోడీ క్లాస్ ని ఆకట్టుకోగా.. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ఈ డ్యూయెట్ క్లాస్ అండ్ మాస్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ గీతాన్ని హరిచరణ్ మరియు నూతనా మోహన్ కలిసి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కొల్లా అవినాష్ దీనికి ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.

'మహా సముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - కేజీయఫ్ గరుడ రామ్ - శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ దశమి బరిలో నిలుస్తున్న ఈ చిత్రం మహా విజయం అందుకుంటుందేమో చూడాలి.