Begin typing your search above and press return to search.
వీడియో: మహా సముద్రంలో జగడాలే రానీ..!
By: Tupaki Desk | 13 Oct 2021 7:47 AM GMTశర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''మహా సముద్రం''. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాలో అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. దసరా కానుకగా రేపు (అక్టోబరు 14) గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాలోని 'జగడాలే రానీ' అనే సాంగ్ వీడియో ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.
శర్వా - సిద్దార్థ్ కలిసి రౌడీ మూకలను కొట్టడంతో 'జగడాలే రానీ' సాంగ్ ప్రారంభమవుతుంది. తమను తాము 'రెబెల్స్' గా చెప్పుకుంటూ హీరోలిద్దరూ వెంబడించి కొట్టడం కన్పిస్తోంది. 'ఎప్పుడూ నువ్ తలెత్తుకోకు.. నిను మించిన తోపు ఎవడిక్కడ.. భయపడితే బ్రతకవు ఎక్కడా..' అంటూ సాగిన ఈ పాట ఎవరికీ భయపడకుండా తమకు నచ్చినట్టుగా జీవించాలని చెబుతోంది. ఇందులో శర్వానంద్ - సిద్ధార్థ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కన్పిస్తున్నారు. మరి ప్రాణ స్నేహితులైన వీరిద్దరూ బద్ధ శత్రువులుగా ఎందుకు మారారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
'జగడాలే రానీ' పాటకు ట్యూన్ కంపోజ్ చేసిన చైతన్ భరద్వాజ్.. సింగర్ హేమ చంద్ర తో కలిసి ఆలపించారు. గేయ రచయిత భాస్కర భట్ల దీనికి సాహిత్యం అందించారు. వైజాగ్ బీచ్ చుట్టుపక్కల లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాజ్ తోటా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మహా సముద్రం' చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.