Begin typing your search above and press return to search.
హీరోలు మారుంటే మహా రిజల్ట్ మరోలా ఉండేదా..?
By: Tupaki Desk | 28 Oct 2021 11:30 PM GMT'Rx 100' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి.. వైలెంట్ లవ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి రెండో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవలే ''మహా సముద్రం'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజయ్.
శర్వానంద్ - సిద్దార్థ్ - అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'మహా సముద్రం' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మల్టీస్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టలేకపోయింది. దీంతో దర్శక హీరోల కెరీర్ లో ప్లాప్ మూవీగా నిలిచింది.
వాస్తవానికి 'మహాసముద్రం' కథను ముందుగా వేరే హీరోలతో చేయడానికి దర్శకుడు అజయ్ భూపతి ప్రయత్నాలు చేసారు. రవితేజ - నితిన్ - నాని - రామ్ వంటి హీరోలకు ఈ కథను వినిపించారు. నాగచైతన్య కు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి కానీ.. అది వేరే స్టోరీ అని అజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇక హీరోయిన్ గా మొదట సమంతను సంప్రదించినట్లు వెల్లడించారు.
అయితే వీరందరికీ మహా కథ నచ్చినప్పటికీ ఇతరత్రా కారణాలతో సున్నితంగా తిరస్కరించారు. కొందరు హీరోలు మల్టీస్టారర్ కావడంతో రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సామ్ మాత్రం డేట్స్ ఖాళీగా లేకపోవడంతో వద్దన్నట్లు దర్శకుడు తెలిపారు. ఇప్పుడు 'మహా సముద్రం' సినిమా ఫలితంతో వీళ్ళు పరాజయం నుంచి తప్పించుకున్నారనే అనుకోవాలి. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా నటించి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో మరి.
అజయ్ భూపతి స్క్రిప్ట్ ని ఓకే చేసిన సిద్ధార్థ్ - శర్వానంద్ లు సినిమాలో తమ బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చారు. కాకపోతే కథ - స్క్రీన్ ప్లే మెప్పించకపోవడంతో ప్లాప్ గా నిలిచింది. 'మహా సముద్రం' సినిమా మీద అజయ్ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈసారి ప్రేక్షకులను అలరించడానికి సెన్సేషనల్ డైరెక్టర్ ఎలాంటి స్క్రిప్ట్ తో వస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే 'మహా సముద్రం' సినిమా నిరాశపరిచిందని కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అజయ్ భూపతి కి తెలిపారు. దీనికి అజయ్ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పాడు. ''మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి... నెక్స్ట్ టైం మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో తిరిగి వస్తాను'' అని అజయ్ భూపతి ట్వీట్ లో పేర్కొన్నారు.