Begin typing your search above and press return to search.

బెయిల్ పై వ‌చ్చి పెళ్లి పీటెక్కిన హీరో!

By:  Tupaki Desk   |   10 July 2018 4:31 PM GMT
బెయిల్ పై వ‌చ్చి పెళ్లి పీటెక్కిన హీరో!
X
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం శనివారం అర్ధంతరంగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఓ యువతితో నాలుగేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి మోసం చేసిన వ్య‌వ‌హారంలో మ‌హాక్ష‌య్ పై రేప్ కేసు న‌మోదైంది. దీంతో - కోర్టు ఆదేశాల ప్రకారం శ‌నివారం నాడు ఊటీలో జ‌ర‌గుతుఓన్న‌ మ‌హాక్ష‌య్ వివాహవేడుక వ‌ద్ద‌కు వెళ్లి విచార‌ణ చేప‌ట్టారు. ఈ ప‌రిణామంతో షాక్ అయిన వధువు - బాలీవుడ్ న‌టి మ‌దాలస శ‌ర్మ కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. దీంతో, ఆరోజు పెళ్లి ఆగిపోయింది. ఈ నేప‌థ్యంలో మ‌హాక్ష‌య్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ....వారిద్ద‌రి పెళ్లి మంగ‌ళ‌వారం నాడు జ‌రిగింది. ఊటిలోని తన విలాసవంతమైన హోటల్ లో సంప్రదాయబద్దంగా వీరి వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం వీరిద్దిరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మ‌హాక్ష‌య్ త‌న‌తో నాలుగేళ్లు స‌హ‌జీవ‌నం చేశాడ‌ని - పెళ్లి చేసుకుంటాన‌ని గ‌ర్భ‌వ‌తిని చేశాడ‌ని ఓ భోజ్ పురి న‌టి ఆరోపించింది. త‌ర్వాత త‌న‌కు గర్భస్రావమయ్యేలా మందులు ఇచ్చాడని, త‌న‌ కుమారుడ్ని వదిలేయక‌పోతే తీవ్ర పర్యావసానాలుంటాయని మహాక్షయ్‌ తల్లి యోగితా బాలీ తనను బెదిరించింద‌ని ఆమె ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం నాడు మ‌హాక్ష‌య్ - మ‌దాల‌స ల వివాహ వేదిక వ‌ద్ద‌కు పోలీసులు విచార‌ణ నిమిత్తం వ‌చ్చారు. అయితే, శ‌నివారం నాడు విచార‌ణ ముగిసిన అనంత‌రం మ‌దాల‌స‌ - మ‌హాక్ష‌య్ లు రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుక‌న్న‌ట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నాడు మ‌రోసారి వీరిద్ద‌రూ కొద్దిమంది అతిథులు - బంధుమిత్రుల మ‌ధ్య సంప్ర‌దాయబ‌ద్ధంగా మ‌రోసారి వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.