Begin typing your search above and press return to search.
183 కోట్లకు 'మహాభారత్' నిర్మాత BR చోప్రా ఆస్తి అమ్మకం
By: Tupaki Desk | 17 Jun 2022 5:30 PM GMTప్రముఖ దర్శకనిర్మాత.. 'మహాభారత్' దర్శకుడు బిఆర్ చోప్రా తన విలాసవంతమైన ప్రాపర్టీని అమ్మకానికి పెట్టడం ముంబై సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ చోప్రా ముంబై జుహూలో నివారం ఉంటున్నారు. అక్కడ తన ఖరీదైన బంగ్లాను రూ. 183 కోట్లకు కొనుగోలుదారులకు విక్రయించారు. దాని స్థానంలో నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు.
ఇది చోప్రాల కుటుంబ ఆస్తి .. ముంబై చిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. బీఆర్ చోప్రా కోడలు దివంగత చిత్రనిర్మాత రవి చోప్రా భార్య అయిన రేణు చోప్రా నుండి కె.రహేజా కార్ప్ ఈ ఆస్తిని కొనుగోలు చేసింది.. దాని స్థానంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను నిర్మించే ప్రణాళికలపై కొనుగోలుదారులు ఆలోచిస్తున్నారు. అమ్మిన బంగ్లా సీ ప్రిన్సెస్ హోటల్ ఎదురుగా ఉందని సమాచారం. బీఆర్ చోప్రా ఇదే ఇంటి నుండి తన వ్యాపారాలను నిర్వహించారు.
అమ్మకం సాగిన బంగ్లా ముంబైలోని ఖరీదైన సెలబ్రిటీలు నివశించే జుహు ప్రాంతంలో ఉంది. ముంబైలోని చలనచిత్ర పరిశ్రమతో అనుసంధానించబడిన అరుదైన సెన్సిటివ్ ప్రదేశం ఇది. చోప్రా కుటుంబ వారసులకు చలనచిత్ర పరిశ్రమతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
నిజానికి ఎందరో అగ్ర నటీనటులకు ఈ బంగ్లా సుపరిచితమని చెబుతున్నారు. ఇక్కడకు వచ్చిన అతిపెద్ద తారలు చోప్రాల్ని కలిసేవారు. బాలీవుడ్ లో అత్యంత ప్రభావవంతమైన ఫిల్మ్ మేకింగ్ కుటుంబాలలో చోప్రాల ప్రస్థానం అసాధారణమైనది. బిఆర్ చోప్రా ఐకానిక్ టీవీ షో 'మహాభారత్' ని రూపొందించారు.
ఇటీవల అతి పెద్ద డీల్ ఇదే
ప్రఖ్యాత ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. కె రహేజా కార్ప్ సంస్థ బీఆర్ చోప్రా కోడలు అయిన రేణు చోప్రా నుండి ఆస్తిని కొనుగోలు చేసారు. ప్రాపర్టీ డెవలప్ మెంట్ సంస్థ దాని స్థానంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను నిర్మించనుందని సమాచారం. ఈ డీల్ లో స్టాంప్ డ్యూటీ చెల్లించిన రూ.11 కోట్లతో కలిపి కొనుగోలుదారులకు రూ.183 కోట్లు ఖర్చయిందని తెలిసింది.
BR చోప్రా బాలీవుడ్ లో అతిపెద్ద ఫిల్మీ కుటుంబ సృష్టికర్త. 1947లో BR ఫిల్మ్స్ ని స్థాపించారు. తర్వాత దీనిని అతని కుమారుడు రవి చోప్రా నడిపారు. బీఆర్ చోప్రా తమ్ముడు యష్ చోప్రా తన కుమారుడు ఆదిత్య చోప్రాతో కలిసి తన స్వంత యష్ రాజ్ ఫిల్మ్స్ ని స్థాపించడానికి ముందు బీఆర్ ఫిల్మ్స్ కోసం అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించాడు. ఆదిత్య చోప్రా సంగీతం- డిజిటల్ రంగం సహా భారీ చిత్రాల నిర్మాణంతో కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. యష్ రాజ్ ఫిలింస్ (YRF) బ్యానర్ కు అతడు అధిపతిగా కొనసాగుతున్నారు.